భారత్, చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య, సరిహద్దు రేఖ వద్ద భారత నిఘా వ్యవస్థ మరింత బలోపేతం చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే..దానిని ఎదుర్కొనేందుకు, భారత సైన్యం తూర్పు లడఖ్ ప్రాంతంలో కొత్త మరియు అధునాతన ఆయుధాలను మోహరించింది. ధనుష్ హోవిట్జర్‌తో పాటు, M4 క్విక్ రెస్పాన్స్‌తో కూడిన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 15 కి.మీ.ల దూరంలో ఉన్న మానవ కార్యకలాపాల గురించి తెలుసుకోవచ్చు.
తూర్పు లడఖ్‌లోని న్యోమా మిలిటరీ స్టేషన్‌లో భారతదేశం నిరంతరం తనను తాను బలోపేతం చేసుకుంటోంది. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఆర్మీ స్పందించి శత్రువుల విరుచుకుపడవచ్చు. ఈ సైనిక స్టేషన్ 14500 అడుగుల ఎత్తులో ఉంది. ANI నివేదిక ప్రకారం, సైన్యం త్వరలో ఇక్కడ K-9 వజ్ర స్వీయ చోదక ఆర్టిలరీ తుపాకులను కూడా మోహరించబోతోంది. అంతేకాదు సాయుధ పోరాట వాహనాలను ఎదుర్కోవడానికి స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు కూడా ఇక్కడ సైన్యానికి అందించనున్నారు.
తూర్పు లడఖ్‌లో భారత సైన్యాన్ని బలోపేతం చేయడానికి స్వదేశీ ఫిరంగి ధనుష్ హోవిట్జర్ మోహరించారు. దీనికి 48 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన ఈ ఫిరంగి నిర్మాణం 2010లో ప్రారంభమైంది. దీని బరువు 13 టన్నులు. విశేషమేమిటంటే, దీనిని ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉపయోగించవచ్చు. ఆర్టిలరీ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ వి మిశ్రా త్వరలో మరో 114 ఫిరంగులు సైన్యంలో చేరనున్నాయని ANI తో చెప్పారు.
రిపబ్లిక్ డే పరేడ్‌లో M4 క్విక్ రియాక్షన్ వెహికల్ ను ప్రదర్శించారు. దీనిని భారతదేశంలో తయారు చేశారు. గాల్వాన్‌లో చైనా సైన్యంతో ఎదురుకాల్పులు జరిగిన తర్వాత.. సరిహద్దులో శత్రువుల కదలికలను అంచనా వేయడానికి అలాంటి వాహనం అవసరమని అర్థమైంది. ఆర్మీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కొండ ప్రాంతాల్లో కూడా ఈ వాహనం గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో 10 మంది జవాన్లు కలిసి ప్రయాణించవచ్చు.
భారత సైన్యం చైనా సరిహద్దులో ఆల్ టెర్రైన్ వాహనాలను మోహరించింది. ఈ వాహనంలో ఒకేసారి నలుగురు నుండి ఆరుగురు సైనికులు ప్రయాణించగలరు. యాక్సెస్ చేయలేని పోస్ట్‌లను చేరుకోవడానికి ఈ వాహనం ఉపయోగించనున్నారు. ఈ వాహనాలు ఎత్తైన ప్రదేశాలలో కూడా పని చేస్తున్నాయి.
చైనా సరిహద్దులో భారత సైన్యం తన నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. ఇక్కడ టాటా రజక్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది 15 కి.మీల దూరంలో మానవ కార్యకలాపాలను.. 25 కి.మీ దూరంలో వాహనాలను గుర్తించగలదు