కొరియన్ మహిళలు అందంగా కన్పించేందుకు అశ్వగంధను తమ డైట్‌లో వివిధ రూపాల్లో వాడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. కొరియన్లు తమ చర్మాన్ని యవ్వనంగా, టైట్‌గా ఉంచేందుకు అశ్వగంధతో చేసిన టీ ని ఎక్కువగా తీసుకుంటారు. ఈ ఆయుర్వేదం మూలిక రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
అశ్వగంధ.. మొక్క వేరు నుండి లభించే పదార్థం. ఇది వేరు రూపంలో ఉంటుంది. దీన్ని సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషదంగా వాడతారు. అశ్వగంధ కేవలం పొడి రూపంలోనే కాకుండా టాబ్లెట్లు, లేహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
అంతేకాదు.. మహిళలకు అశ్వగంధ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మహిళలు సాధారణంగా హార్మోన్ సమస్యలు ఎక్కువగా ఎదురుకుంటూ ఉంటారు. అలాంటి వారికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. హార్మోన్ సమస్యలు తగ్గిస్తుంది. నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళలలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
అశ్వగంధ కేవలం అందానికి ఆడవారికి మాత్రమే కాదు.. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, నరాల సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కండరాలకు బలాన్నిస్తుంది. శరీర వేగం పెరిగేందుకు సహకరిస్తుంది. అశ్వగంధ సంతానోత్పత్తికి సహకరిస్తుంది.
అశ్వగంధలో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడే గుణాలున్నాయి. మధుమేహ రోగులకు ఉత్తేజాన్ని అందిస్తుంది. మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అశ్వగంధ టీ తయారు చేసేందుకు 1 కప్పు నీటిలో సగం స్పూన్ అశ్వగంధ పౌడర్ కలపాలి. 5 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. గోరువెచ్చగా తాగాలి