Pear Fruit juice Benefits: ఈ పండ్లతో జ్యూస్‌ అమృతమే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

Updated on: Nov 20, 2025 | 3:29 PM

పియర్ అనేది కాలానుగుణ పండు. దీని శాస్త్రీయ నామం పైరస్. ఇంగ్లీష్‌లో దీనిని పియర్ అని పిలుస్తారు . పియర్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. పుష్కలమైన ఆయుర్వేద లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి . పియర్స్‌లో విటమిన్ సి, విటమిన్ బి-కాంప్లెక్స్, కె, ఖనిజాలు, పొటాషియం, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫోలేట్, ఫైబర్, రాగి, మాంగనీస్, మెగ్నీషియం, అలాగే సేంద్రీయ సమ్మేళనాలు నిండి ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, దాని ఫైబర్‌లో ఎక్కువ భాగం పెక్టిన్ రూపంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పియర్స్‌లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇన్ని పోషకాలు, లాభాలు కలిగిన పియర్స్‌ జ్యూస్‌ రూపంలో తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 6
ఎముకల కోసం: ఎముకల ఆరోగ్యానికి పియర్‌ పండ్లు చాలా మంచిది. జ్యూస్‌ రూపంలో తీసుకోవటం వల్ల దీనిలోని కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. తరచూ పియర్‌ పండ్లు, జ్యూస్‌ తీసుకోవటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

2 / 6
రక్తహీనతకు: పియర్‌  పండ్లు ఐరన్‌కు మంచి మూలం. హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారు పియర్‌ పండ్లు, జ్యూస్‌ రూపంలో తీసుకోవటం వల్ల రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. పియర్ ఫ్రూట్ లో పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

3 / 6
శక్తి వనరు: మీకు శక్తి తక్కువగా అనిపిస్తే పియర్‌ పండ్లు తినటం లేదంటే జ్యూస్‌ తీసుకోవటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఈ పండ్లలో లభించే పోషకాలు శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి కూడా సహాయపడతాయి.

4 / 6
ఊబకాయం కోసం: ప్రస్తుత రోజుల్లో ఊబకాయం ఒక తీవ్రమైన సమస్యగా మారింది. మీరు అధిక బరువు గురించి ఆందోళన చెందుతుంటే మీ ఆహారంలో పియర్‌ పండ్లను చేర్చుకోండి. ఈ పండ్లలోని పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

5 / 6
జీర్ణక్రియకు: పియర్‌ పండ్లను ఫైబర్ కు మంచి వనరుగా పరిగణిస్తారు. వీటిని పండుగా లేదంటే జ్యూస్‌గా తీసుకున్నా కూడా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి బేరి పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

6 / 6
డయాబెటిస్ కోసం: డయాబెటిక్ రోగులకు పియర్‌ పండ్లు తినడం ప్రయోజనకరం. వీటిలో ఫైబర్, యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే క్యాన్సర్‌ను కూడా దూరంగా ఉంచడంలో ఈ పండులోని పోషకాలు సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.