
టైప్ 1 మధుమేహం పిల్లల్లో సర్వసాధారణమే అయినప్పటికీ చాలామంది పిల్లల్లో టైప్-2 మధుమేహం కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. చిన్నారుల్లో కనిపించే కొన్ని లక్షణాలను పసిగట్టడం ద్వారా ముందుగానే ఈ వ్యాధి గుర్తించవచ్చు.

వేడి వాతావరణంలో పిల్లలకు ఎక్కువ దాహం వేయడం సహజం. అయితే అదే పనిగా దాహం అనిపించి ఎక్కువగా నీరు తాగుతుంటే మాత్రం జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినప్పుడు కూడా ఎక్కువగా దాహం వేస్తుంది.

శరీరంలో చక్కెర స్థాయులు పెరిగితే శక్తిని కోల్పోతారు. ఇన్సులిన్ స్థాయులు కూడా తగ్గిపోతాయి. ఫలితంగా ఎక్కువగా ఆకలివేస్తుంది. కాబట్టి పిల్లలు అతిగా తింటుంటే టైప్-2 డయాబెటిస్ కావొచ్చు.

శరీరంలో చక్కెర స్థాయులు పెరిగితే శక్తిని కోల్పోతారు. ఇన్సులిన్ స్థాయులు కూడా తగ్గిపోతాయి. ఫలితంగా ఎక్కువగా ఆకలివేస్తుంది. కాబట్టి పిల్లలు అతిగా తింటుంటే టైప్-2 డయాబెటిస్ కావొచ్చు.

గాయాలు త్వరగా నయం కానప్పుడు కూడా సందేహించాల్సిందే. ఎందుకంటే ఇది కూడా మధుమేహం లక్షణం. ఇలాంటి సమయాల్లో వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. ఈ సమస్య పిల్లల్లోనే కాదు మధుమేహం ఉన్న పెద్దలలో కూడా కనిపిస్తుంది. కాబట్టి పిల్లలు ఎక్కువగా మూత్రానికి వెళుతుంటే వెంటనే జాగ్రత్తపడండి.

ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో వృద్ధులతో పాటు యువత, పిల్లల్లోనూ మధుమేహం బయటపడుతోంది. దీనికి ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది.