Red Banana Health Benefits: ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు..

Updated on: Mar 11, 2025 | 7:22 AM

అరటి పండ్లను పేదవాడి యాపిల్‌గా పిలుస్తారు. ఎందుకంటే.. సీజన్‌తో సంబంధం లేకుండా.. అందరికీ అందుబాటు ధరలో లభిస్తుంది ఈ పండు. అరటి పండును అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది ఎనర్జీ బూస్టర్‌ ఫుడ్. ఇలాంటి అరటి పండులో ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. పసుపు పచ్చవి, చక్కెరకేళి, కొండ అరటి పండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం, కర్పూర చక్కెర కేళీ వంటి కొన్ని రకాలు మనం తరచూ చూస్తుంటాం. మార్కెట్లో ఎర్రటి అరటిపండ్లు కూడా కనిపిస్తుంటాయి. ఎర్రగా నిగనిగలాడుతూ.. ఆకర్షణీయంగా కనిపించే ఈ అరటిపండులో పోషకాలూ మెండుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎర్ర అరటిపండు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
సాధారణ అరటి పండుతో పోలిస్తే..ఎర్ర అరటి పండులో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయట. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎర్రటి అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

2 / 5
ఎర్రటి అరటిపండ్లలో లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పసుపు అరటి పండుతో పోలిస్తే.. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్‌ ఏ గా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకం.

3 / 5
ఎర్ర అరటిపండ్లు తినడం వల్ల చర్మం ఎర్రబడటం, పొడిబారడం, దద్దుర్లు, సోరియాసిస్ వంటి అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది.  చలికాలంలో చర్మం పగలడం కూడా తగ్గుతుంది.. కాబట్టి మీరు ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతుంటే ఎర్రటి అరటిపండు తినవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఎర్ర అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడుతుంది.

5 / 5
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడతాయి. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం,  జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఎర్ర అరటిపండు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పండుతుంది.