
అరటిపండు తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. ఇది రుచికరమైనదే కాకుండా, అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కూడా కలిగి ఉంది. శక్తి అధికంగా ఉండే ఈ పండును తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇందులో విటమిన్ ఎ, బి, సి, బి6 తోపాటు.. డైటరీ ఫైబర్, మాంగనీస్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అరటిపండును సూపర్‌ఫుడ్‌గా కూడా పరిగణిస్తారు. ఇది అలసట, బలహీనతను తొలగిస్తుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. మన రోగనిరోధక శక్తి నుంచి లైంగిక సామర్థ్యాన్ని పెంచడం వరకు అరటిపండ్లు ఎక్కువగా సహాయపడతాయి. అందుకే.. ఆరోగ్యానికి మేలు చేసే అరటిపండ్లను క్రమం తప్పకుండా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండును షేక్, చిప్స్, కూరగాయల రూపంలో కూడా తినవచ్చు. ముఖ్యంగా.. ఇవి ఏ సీజన్‌లోనైనా సులభంగా దొరుకుతాయి. అంతేకాకుండా.. అనేక ఇతర పండ్ల కంటే చౌకగా లభిస్తాయి. అయితే, రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్లను తినవచ్చు. అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపు సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది: అరటిపండ్లు పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో పెక్టిన్ ఉంటుంది. ఇది కరిగే ఫైబర్. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. అరటిపండు వాపును తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీంతో మనం అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా కాపాడుకోగలుగుతున్నాం.

గుండెను, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది: అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది స్ట్రోక్ లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉండే అరటిపండ్లు తినడం వల్ల కిడ్నీలకు కూడా మేలు జరుగుతుంది.

ఒత్తిడిని దూరం చేస్తుంది: అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుంది. సెరోటోనిన్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. దీనిని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.

బలహీనతను దూరం చేస్తుంది: అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ పొట్టను త్వరగా నింపుతుంది. మీరు అల్పాహారంలో అరటిపండును తీసుకోవచ్చు. చాలా సార్లు తొందరపాటు వల్ల అల్పాహారం మానేస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు అరటిని తినవచ్చు. ఇది మీకు శక్తిని ఇస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది: అరటిపండులో మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఇది ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఇది ఎముకలు దృఢంగా పని చేస్తుంది. అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి.

రక్తహీనత: అరటిపండులో ఫోలేట్, ఐరన్ ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. అరటిపండు తినడం వల్ల శరీరంలోని బలహీనత, రక్త హీనత రెండూ తొలగిపోతాయి.

లైంగిక శక్తిని పెంచుతుంది: అరటిపండులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా.. అరటిపండులో ట్రిప్టోఫాన్, సెరోటోనిన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లం, మన 'ఫీల్-గుడ్' హార్మోన్లు కూడా ఉన్నాయి. అరటిపండ్లు కూడా పొటాషియంతో నిండి ఉంటాయి. సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, లైంగిక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అరటిపండ్లలో బ్రోమెలైన్ అనే ఎంజైమ్.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి స్పెర్మ్, లిబిడో (స్టామినా) ను పెంచుతుంది.