
ప్రపంచంలో అనేక ప్రకృతి వింతల్లో ఒకటి బ్లాక్ బ్యాట్ ఫ్లవర్. ఈ పువ్వు రంగు నలుపు. అంతేకాదు ఆకారంలో కూడా ఎగిరే గబ్బిలాన్ని పోలి ఉంటాయి. అరుదైన ఈ పువ్వులను అకస్మాత్తుగా చూస్తే మొక్కల మీద గబ్బిలం వాలిందేమో అనిపిస్తుంది. కంద జాతికి చెందిన ఒక మొక్కకు వికసించే ఈ పువ్వులను బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ అంటే గబ్బిలం పువ్వు అని పిలుస్తారు. ఫ్రెంచ్ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు.

వింతగా కనిపించే నల్లని పువ్వులను బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ లేదా టక్కా చాంట్రియరి అని అంటారు. డయోస్కోరేసి కుటుంబానికి చెందినది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మొక్కలు సెమీ-ట్రాపికల్ వాతావరణంలో బాగా పెరుగుతాయి. అంతేకాదు ఈ పువ్వులు ఎంత పెద్దగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాయి.

ఈ పువ్వు దీని రంగు ఆకారం కారణంగా ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్ ఫ్లవర్ గా ప్రఖ్యాతిగాంచాయి. పువ్వుల్లోని కేసరాలు పొడవాటి మీసాలులా.. ఆకారం అచ్చం గబ్బలాలా కనిపిస్తుంది. కనుకనే ఈ పువ్వులను ముద్దుగా గబ్బిలం పువ్వు అని అంటారు. తేమ అధికంగా ఉండే బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేసియా, మయాన్మార్, థాయ్‌లండ్ అడవుల్లో కనిపిస్తాయి.

మొక్కలు పెంచడంలో ఆసక్తి ఉన్నవారికి ఇంట్లో పెంచుకునెందుకు తగినంత స్థలం ఉంటే ఇంటి లోపల లేదా నీడ ఉన్న ప్రదేశంలో పెరుగుతాయి. అయితే వీటిని పెంచడంలో ప్రారంభంలో కొంచెం కష్టం అనిపిస్తుంది.

వసంతకాలం నుంచి శరదృతువు ప్రారంభం ఈ పువ్వులు వికసిస్తాయి. అనుకూలమైన వాతావరణం ఆంటే ఒక మొక్కకు ఒకేసారి అనేక పువ్వులు వికసిస్తాయి. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుదని అప్పుడు ఆ మొక్క.

వింతగా కనిపించడంమే కాదు.. ఈ గబ్బిల పువ్వులో ఔషధ ఉన్నాయి. ఈ పువ్వు ఆకర్షణకు మించి.. దీనిలోని ఔషధ లక్షణాలతో విలువైనదిగా మారింది. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.

అధిక రక్తపోటు, గ్యాస్ట్రిక్ అల్సర్లు ,హెపటైటిస్ వంటి సమస్యలను పరిష్కరించడానికి సాంప్రదాయ వైద్యంలో రైజోమ్‌లను ఉపయోగిస్తారు. అవి టాక్కలోనోలైడ్స్ వంటి సమ్మేళనాలకు మూలంగా కూడా పనిచేస్తాయి. వీటిలో ఔషధ గుణాలను క్యాన్సర్ నిరోధక సామర్థ్యం ఉన్నాయేమో అనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు.

ముదురు రంగులో గబ్బిలంలా వింతగా, అందంగా ఉంటాయి. వీటి కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. పన్నెండు అంగుళాల వెడల్పు, పది అంగుళాల పొడవుతో అకస్మాత్తుగా చూస్తే కొంత భయ పడేలా ఉంటాయి. అందుకనే ఈ పువ్వులను దక్షిణాసియా దెయ్యం పువ్వులు అని కూడా పిలుస్తారు.