
ఆఫీసులకు వెళ్లే చాలా మంది ప్రతి రోజూ ఇంట్లో నుంచి లంచ్ బాక్సును తీసుకెళ్తూ ఉంటారు. బయట ఫుడ్ తినకుండా ఇంట్లో తయారు చేసే ఆహారం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రోజూ లంచ్ తీసుకెళ్లేవారు.. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లంచ్ బాక్స్ తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవాలి. పాల ఉత్పత్తులతో తయారు చేసే ఆహారం, పండిన కూరగాయలు, మాంసాహార పదార్థాలు వంటివి.. 'డేంజర్ జోన్' గా పిలుస్తారు. ఇవి (4°C మరియు 60°C) మధ్య ఉష్ణోగ్రతలకు త్వరగా పాడైపోతాయి.

దీని వల్ల బ్యాక్టీరియా వంటివి వేగంగా పెరుగుతాయి. ఇవి తినడం వల్ల అనారోగ్య పాలవుతారు. అనారోగ్యాన్ని పెంచుతాయి. మీరు తినే ఆహారం త్వరగా పాడవ్వకుండా ఉండాలంటే.. సరైన విధంగా ప్యాకేజ్ చేయాలి.

త్వరగా పాడైపోయే వస్తువులను చల్లగా ఉంచడానికి ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగులు లేదా ఐస్ ప్యాకులతో కూడాని కూలర్‌లను ఉపయోగించాలి. వీటి వలన ఆహారం పాడైపోకుండా ఉంటాయి.

అదే విధంగా ఇప్పుడు లంచ్ బాక్సులుగా ప్లాస్టిక్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. వీటి వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్టెయిన్ లెస్ స్టీల్, గాజు లేదా సిలికాన్ వంటి పర్యావరణ అనుకూల పదార్థాలను ఎంచుకోండి.