AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో ఎంతో రుచిగా సులువుగా చేసుకునే అమ్మమ్మల నాటి కందికట్టు, ముద్దపప్పు

తెలుగు వంటల్లో కందికట్టు, ముద్దపప్పు స్థానమే వేరు ఎందుకంటే వీటిని తినని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉంటే దీని రుచే వేరు. మరి ఈ కాంబో అంత స్పెషల్.

Prasanna Yadla
|

Updated on: May 14, 2026 | 6:30 AM

Share
తెలుగు వంటల్లో కందికట్టు, ముద్దపప్పు స్థానమే వేరు ఎందుకంటే వీటిని తినని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా  వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉంటే దీని రుచే  వేరు. మరి ఈ కాంబో అంత స్పెషల్. 
ఇంకా ఇది చాలా ఈజీగా జీర్ణమవుతుంది.

తెలుగు వంటల్లో కందికట్టు, ముద్దపప్పు స్థానమే వేరు ఎందుకంటే వీటిని తినని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉంటే దీని రుచే వేరు. మరి ఈ కాంబో అంత స్పెషల్. ఇంకా ఇది చాలా ఈజీగా జీర్ణమవుతుంది.

1 / 5
కందికట్టు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు కందిపప్పు, ఒక టమాటా, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ పసుపు, 
రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీరు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , రెండు టేబుల్ స్పూన్స్  నూనె, అర టీ స్పూన్ ఆవాలు, 
అర టీ స్పూన్ జీలకర్ర,  నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి.

కందికట్టు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, ఒక టమాటా, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీరు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి.

2 / 5

 కందికట్టు రెసిపీ తయారీ విధానం ముందుగా కందిపప్పును బాగా కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. దానిలో  టమాటాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర లేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక కప్పు నీరు కూడా నీరు కూడా వేసి 6 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాగా ఉడికించాలి.
ఇంకా ఇది బాగా ఉడికిన తర్వాత పప్పును వేసి కలుపుకోవాలి. చివర్లో పోపు పెట్టి కందికట్టులో కలపాలి.

కందికట్టు రెసిపీ తయారీ విధానం ముందుగా కందిపప్పును బాగా కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. దానిలో టమాటాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర లేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక కప్పు నీరు కూడా నీరు కూడా వేసి 6 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాగా ఉడికించాలి. ఇంకా ఇది బాగా ఉడికిన తర్వాత పప్పును వేసి కలుపుకోవాలి. చివర్లో పోపు పెట్టి కందికట్టులో కలపాలి.

3 / 5

 ముద్దపప్పుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. కందిపప్పును కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా కుక్కర్‌లో పప్పు, అర టేబుల్ స్పూన్  పసుపు, నీరు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పప్పు గుత్తితో మెదిపి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
దీనిని ఎలా తినాలంటే?  వేడి వేడి అన్నంలో  ముద్దపప్పు, నెయ్యి  వేసుకుని ఇంకా దీనిలో కొద్దిగా కందికట్టు పోసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.ఇది మాత్రమే కాకుండా అవకాయ, అప్పడం, ఉల్లిపాయ ముక్కలతో తింటే నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు అంత టేస్టీ టేస్టీ ఉంటుంది.

5 / 5
Follow Us