
కలువ కళ్లకు కాటుక అద్దితే ముఖారవిందం మరింతగా ఇనుమడిస్తుంది. అయితే కాటుక పెట్టుకుంటే కాసేపటికే కళ్ల చుట్టూ చెదిరిపోతుంటుంది. ఇక జిడ్డు చర్మం కలిగిన వారికి కాటుక పెట్టుకోవడానికి జంకుతుంటారు. కాటుక చెదరిపోకుండా రోజంతా ఉండటానికి కొన్ని ట్రిక్స్ సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. ఈ టిప్స్ ఫాలో అయితే 24 గంటల పాటు కాటుక అలాగే ఉంటుంది.

ముందుగా కళ్లకు మేకప్ వేసుకునేటప్పుడు మీకు ఏది సరిపోతుందో తనిఖీ చేసుకోవాలి. మీ చర్మ తత్వాన్ని బట్టి కళ్ళకు సూటయ్యే ఉత్పత్తిని ఎంచుకోవాలి. అలాగే సున్నితమైన చర్మానికి అనుకూలంగా ఉండే కాజల్‌ను మాత్రమే ఎంచుకోవాలి.

ఐ మేకప్ వేసుకునే ముందు ప్రైమర్ లేదా ఫౌండేషన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. ప్రైమర్‌ను అప్లై చేయడం ద్వారా కంటి అలంకరణ మరింత ఆకర్షణీయంగా వస్తుంది.

అంతేకాకుండా కళ్ల మేకప్ చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. అయితే మీరు ప్రైమర్‌ని ఉపయోగించకూడదనుకుంటే, ఆయిల్-ఫ్రీ ఫౌండేషన్‌ను ఎంచుకోవచ్చు.

కాజల్‌ను అప్లై చేసిన తర్వాత, అదనంగా బ్రష్‌తో కళ్ల కింద కొద్దిగా కాంపాక్ట్‌తో ఫౌండేషన్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి కింద భాగంలో తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ అది చెదిరిపోకుండా ఉంటుంది.