
మే 14న గురు గ్రహం వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశించ బోతుంది. అయితే దీని ప్రభావం 12 రాశులమీద పడుతుంది. కానీ నాలుగు రాశుల వారికి మాత్రం గురు గ్రహం అనుకూల ప్రభావాన్ని చూపబోతుంది. కాగా, ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో వారికి గురు ప్రభావంతో ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం.

గురు సంచారం వల్ల తుల రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం వీరి సొంతం అవుతుంది. ముఖ్యంగా వీరికి ఇంటా బయట చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రతి పనిలో విజయం సాధించగలిగే అద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయంట.

వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా గురు సంచారం అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు. అలాగే వీరికి ప్రతి పనిలో పెద్దపెద్ద మార్పులు వస్తాయి. ఒత్తిడి నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. ఉద్యోగాలు చేసే వారు కొత్త ఆదాయం మార్గాలు పొంది సంతోషంగా గడుపుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

ధనస్సు రాశి వారికి గురు సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. బృహస్పతి వీరికి అనుకూల స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి . ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది అలాగే ప్రతి పనిలో విజయం సాధించే అద్భుతమైన శక్తిని పొందుతారు. ప్రయాణాలు అద్భుతంగా కలిసి వస్తాయి.

సింహ రాశి వారికి గురు సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా అంతా శుభమే జరుగుతుంది. వీరి జీవితంలో అనేకోని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఏ పని చేసినా అంతా సవ్యంగా జరిగిపోవడంతో ఆనందంగా ఉంటారు.