
విదేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అందాలు కూడా చిన్నబోయేలా చేయగల మనోహరమైన ప్రదేశాలు దేశంలో అనేకం ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో ఒకటి కర్ణాటకలోని జోగ్ జలపాతం. వర్షాకాలంలో అయితే దీని అందం రెట్టింపు అవుతుంది.

జోగ్ జలపాతం కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ జలపాతం నుంచి పడే నీరు చాలా ఆకర్షణీయం ఉంటుంది. ఈ జలపాతం స్థానిక షరావతి నదిలో కలుస్తుంది.

జలపాతం నుంచి పడే నీరు మాత్రమే కాక, చుట్టూ ఉన్న పర్వతాలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. ఈ పచ్చదనం జలపాతం అందానికి శోభను చేకూర్చేలా కనిపిస్తుంది. వర్షాకాలంలో ఈ జలపాతం సహజ సౌందర్యం మరింత పెరగడానికి చుట్టూ ఉన్న పచ్చదనమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.

జోగ్ జలపాతం, చుట్టూ ఉన్న పచ్చని అందాలతో పాటు.. మీరు ఇక్కడ అనేక ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి కూడా అవకాశం ఉంది. జోగ్ జలపాతానికే సమీపంలోనే డబ్బే జలపాతం, లింగన్మక్కి ఆనకట్ట, తుంగ ఆనికట్ డ్యామ్ వంటివి కూడా ఉన్నాయి.

పైగా జోగ్ జలపాతం చుట్టూ వెజ్, నాన్‌వెజ్ ఫుడ్‌ని అందించే అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో కలిసి కూడా పర్యటించేందుకు ఇది చక్కని ప్రదేశం.