AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీలకర్ర నీళ్లు Vs మెంతి నీళ్లు.. ఈ రెండిటిలో ఆ సమస్యలకు ఏది బెస్ట్..? ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..

Jeera Water Vs Fenugreek Water: మధుమేహం అనేది నేటి కాలంలో ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఈ చక్కెర వ్యాధి బారిన పడుతున్నారు. అయితే వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో దీనిని నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు మరియు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జీలకర్ర, మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏది ఉత్తమం? ఏది ఎలా పనిచేస్తుంది? అనేది తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 22, 2026 | 4:31 PM

Share
మన దైనందిన జీవితంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇంటి చికిత్సలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం వంటి వాటిని నివారించడానికి, నియంత్రించడానికి సహజ పద్ధతులు సురక్షితమైనవి. ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వెతుకుతున్న ప్రశ్న.."షుగర్ తగ్గడానికి జీలకర్ర నీరు మంచిదా? లేక మెంతుల నీరు మంచిదా? అని. దీనిపై ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ, పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

1 / 5
జీలకర్ర నీటితో ఇన్సులిన్ పెంపు: జీలకర్ర కేవలం కూరలకు రుచిని ఇవ్వడమే కాదు, ఒక అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తుంది. 2017లో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ పత్రికలో ప్రచురించబడిన ఒక క్లినికల్ అధ్యయనం ప్రకారం.. జీలకర్రకు శక్తివంతమైన మధుమేహ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడమే కాకుండా, కణాల ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.

2 / 5
బరువు నియంత్రణ: మధుమేహం వల్ల పెరిగే అధిక బరువును తగ్గించడంలో జీలకర్ర నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుద్ధి చేసి, గ్యాస్ మరియు అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగడం వల్ల రోజంతా చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

3 / 5
మెంతుల నీరు: మధుమేహ నియంత్రణలో మెంతులకు సాటిలేదని చెప్పవచ్చు. ఇందులో ఉండే అధిక పీచుపదార్థం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతులు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం నుంచి చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరకుండా నిరోధించబడుతుంది. భోజనం చేసిన తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చేయడంలో మెంతుల నీరు అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల టైప్-2 డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.

4 / 5
ఏది ఉత్తమం?: జీలకర్ర, మెంతులు రెండూ వాటి ప్రత్యేక గుణాలను కలిగి ఉన్నాయి. అయితే పరిశోధనల ప్రకారం.. కేవలం రక్తంలో చక్కెరను తగ్గించడమే లక్ష్యం అయితే మెంతుల నీరు అత్యంత ప్రభావవంతమైనది.
మీరు మధుమేహంతో పాటు అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే జీలకర్ర నీరు సరైన ఎంపిక. ఈ రెండింటి ప్రయోజనాలను పొందాలనుకునే వారు ఒక రోజు మెంతుల నీరు, మరోరోజు జీలకర్ర నీరు తాగడం మంచి పద్ధతి.

ఏది ఉత్తమం?: జీలకర్ర, మెంతులు రెండూ వాటి ప్రత్యేక గుణాలను కలిగి ఉన్నాయి. అయితే పరిశోధనల ప్రకారం.. కేవలం రక్తంలో చక్కెరను తగ్గించడమే లక్ష్యం అయితే మెంతుల నీరు అత్యంత ప్రభావవంతమైనది. మీరు మధుమేహంతో పాటు అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే జీలకర్ర నీరు సరైన ఎంపిక. ఈ రెండింటి ప్రయోజనాలను పొందాలనుకునే వారు ఒక రోజు మెంతుల నీరు, మరోరోజు జీలకర్ర నీరు తాగడం మంచి పద్ధతి.

5 / 5
Follow Us