
మనం ఫోన్ కొని కొన్ని రోజులు వాడిన తర్వాత అది స్లో అయిపోతుంది. ఫోన్ వాడేప్పుడు తరచూ హ్యాంగ్ అవటం జరుగుతుంది. లాక్ ఓపెన్ చేసినా లేట్‌గా ఓపెన్ కావడం, యాప్స్ కూడా లేట్‌గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఒన్ని సార్లు స్క్రీన్ కూడా ఆగిపోతుంది. మీ ఫోన్‌లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఫోన్‌ను మార్చాల్సిన సమయం ఆసన్నమైనట్లే.

అయితే మనం ఫోన్ వాడేప్పుడు కొన్ని సార్లు ఫోన్ బ్యాటరీ స్పీడ్‌గా అయిపోతుంది. మళ్లీ ఛార్జింగ్ పెట్టిన కూడా ఎక్కువ సమయం ఉండదు. బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఫుల్‌గా ఛార్జ్ చేసిన తర్వాత కూడా ఫోన్ బ్యాకప్ ఇవ్వదు.ఈ సంకేతాలు కూడా మీఫోన్ పైనయిపోయిందని చెప్పడానికి సూచికలు

మనం ఇంటర్నెట్ వాడుతున్నా, గేమ్స్ ఆడుతున్నా.. ఫోన్ వేడెక్కి కొన్ని సందర్భాల్లో ఫోన్ ఐరన్ బాక్స్‌లా మారిపోతుంది. అయినా కూడా అలానే మీరు వాడారో ఇక అంతే సంగతి.. ఎందుకంటే ఓవర్ హీట్ అయితే మీ ఫోన్ పేలిపోవచ్చు. అందుకే మీ ఫోన్‌ను వెంటనే మార్చడం మంచిది.

కొన్ని సార్లు మన ఫోన్ మన ప్రమేయం లేకుండానే స్విచ్చాఫ్ అవ్వడం, రిస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి సంకేతాలు కూడా మని ఫోన్ పాడవుతుందని చెప్పడానికి సూచనలు. కాబట్టి మీ ఫోన్ ఇలా క్రాష్ అవుతుంటే వెంటనే దాన్ని మార్చడం మంచింది.

మరొక సంకేతం ఏంటంటే.. కొన్ని సార్లు మనం ఫోన్‌ను ఛార్జింగ్ చేసినా అది త్వరగా ఛార్జ్ కాదు.. ఫోన్ చార్జ్ అవ్వడానికి గంటల సమయం తీసుకుంటుంది.. అంతసేపు పెట్టినా 5, 10 శాతం మాత్రమే చార్జ్ అవుతుంది. ఇవి కూడా మన ఫోన్ లైఫ్ అయిపోయిందని చెప్పడానికి సంకేతాలు. పైన పేర్కొన్న సమస్యలు మీ ఫోన్‌లో ఉంటే.. దాన్ని మార్చడం బెటర్.