
జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక జామ పండు తినడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడొచ్చు. జామ పండులో రెండు రకాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి తెలుపు కాగా.. మరొకటి గులాబీ రంగులో ఉంటుంది. ఇవి రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ పింక్ రంగులో ఉండే జామ పండు మరింత ప్రత్యేకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గులాబీ రంగులో ఉండే జామ తినడం వలన అధిక రక్త పోటను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటుంది. రక్తపోటును కంట్రోల్‌లో ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది.

పింక్ జామ పండు తింటే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఇది ఎంతో సహాయ పడుతుంది. కొలెస్ట్రాల్‌తో బాధ పడేవారు ఇది తింటే చాలా బెటర్. ఈ పండు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

పింక్ జామలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. దీంతో త్వరగా వైరస్, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. అదే విధంగా జీర్ణ సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

గులాబీ రంగులో ఉండే జామ పండు తింటే.. మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పడుతుంది. మతిమరుపును తగ్గించి.. బ్రెయిన్ యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. త్వరగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.