
ఉప్పల్‌లో అడ్డగోలుగా బ్లాక్ టికెట్ల దందా స్టేడియం దగ్గర బ్లాక్ కొత్త ముఠా టికెట్లు అమ్ముతునారు. SRH VS RCB మ్యాచ్ చూసేందుకు పోటీ. టికెట్ దొరక్క స్టేడియం చుట్టూ ఫ్యాన్స్ చక్కర్లు కొడుతున్నారు. ఫ్యాన్స్‌కు టికెట్లు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న కేటుగాళ్లు. ఒక్కో టికెట్ రూ.10 వేలకు విక్రయిస్తున్న ముఠా . బ్లాక్‌లో అమ్మితే ఊచలు గ్యారంటీ అంటూ పోలీస్ వార్నింగ్ ఇచ్చారు .

ఫ్యాన్స్ క్రేజ్‌ని క్యాష్ చేసుకొని రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్ , వందల కొద్దీ వెబ్‌సైట్‌లలో నకిలీ టికెట్ల విక్రయాలు. ఉప్పల్ స్టేడియంలో థర్డ్ ఫ్లోర్ టికెట్ 1680 అంటూ ప్రకటనలు . సైబర్ క్రిమినల్ మోసాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో థర్డ్ ఫ్లోర్ స్టాండ్ లేదు కదా అని ప్రశ్నించిన టీవీ9. ఉప్పల్, రాజీవ్ గాంధీ స్టేడియం వేర్వేరు అంటూ మళ్లీ దొరికిపోయిన కేటుగాడు. టీవీ9 గట్టిగా ప్రశ్నించడంతో ఫోన్ కాల్ కట్ చేసిన కేటుగాడు.

ఈ సీజన్‌లో ఉప్పల్‌లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్ కావడంతో ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఇదే అదనుగా మోసాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే బ్లాక్ మార్కెట్‌పై, ఫేక్ యాప్‌లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు.. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న కొందరిని అరెస్ట్ చేశారు. నకిలీ వెబ్‌సైట్లను, యాప్‌లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులు గంట ముందే స్టేడియానికి చేరుకుని తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని మల్కాజిగిరి సీపీ సుమతి సూచించారు. టికెట్ ఉన్నవారంతా తమకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని కోరారు. స్టేడియంలో సీట్లను సులభంగా గుర్తించేందుకు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లోని గూగుల్ మ్యాప్స్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అలాగే స్టేడియం ప్రాంగణంలోని సైన్ బోర్డులపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా నిర్దేశిత గేట్లు, సీట్ల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రేక్షకులందరూ తప్పనిసరిగా ఈ సైన్ బోర్డులను గమనించాలని సూచించారు.

అత్యవసర సమయాల్లో ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు వీలుగా స్టేడియంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్‌లను ప్రదర్శించామని సీపీ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే 'డయల్ 100' సేవలను ఉపయోగించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. IPL ప్రేక్షకులు గంట ముందే స్టేడియంకు చేరుకోవాలి. కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి. QR కోడ్ స్కాన్ చేసి గేటును సులభంగా చేరుకోవచ్చు. సైన్ బోర్డులను తప్పనిసరిగా ఫాలో కావాలి. ఫేక్ టికెట్ వెబ్‌సైట్లపై జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ చూడాలి. ఎమర్జెన్సీలో డయల్ 100కు కాల్ చేయాలి.