Inter Exams: రేపే ఇంటర్ పరీక్షలు.. మాల్ ప్రాక్టీస్‎కు పాల్పడినా.. ఒక్కనిమిషం ఆలస్యం అయినా అంతే..

Edited By: Ravi Kiran

Updated on: Feb 27, 2024 | 10:03 AM

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 19 వరకు జరిగే ఏగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి విద్యార్థులను అనుమతించమని.. ఆలస్యం కాకుండా చూసుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓఝా తెలిపారు. విద్యార్థుల హాల్‌ టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచారు.

1 / 7
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 19 వరకు జరిగే ఏగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తారు. ఒక్క  నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి విద్యార్థులను అనుమతించమని.. ఆలస్యం కాకుండా చూసుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓఝా తెలిపారు.

2 / 7
రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాదాపు పది లక్షల మంది విద్యార్థులు రాయనున్న ఈ పరీక్షలకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. పకడ్బందీ ఏర్పాట్లతో పాటు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు.  రాష్ట్రవాప్తంగా తీసుకున్న చర్యలు, స్టూడెంట్స్ కు ఇంటర్ బోర్డు పెట్టిన నిబంధనలు ఎంటో మీరే చూడండి.

3 / 7
విద్యార్థుల హాల్‌ టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచారు. వారు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీటిపై ప్రిన్సిపాళ్ల సంతకం లేకున్నా పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లకు ఇంటర్‌ బోర్డు ఆదేశాలిచ్చింది. హాల్‌ టికెట్‌లో పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్టుల వివరాల్లో తప్పులు దొర్లితే కళాశాల ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

4 / 7
డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఉంచుతున్నారు. పరీక్ష గదికి 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయించనున్నారు. ఇంటర్ పస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనున్న 4 లక్షల 78వేల 718 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ పరీక్షలు రాయనున్న  5 లక్షల 02 వేల 260 మంది విద్యార్థులు. పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారుల సమన్వయంతో ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు.

5 / 7
ఉదయం 9 గంటల తరవాత పరీక్ష హల్ లోకి అనుమతి ఉండదన్నారు ఇంటర్ బోర్డు సెక్రెటరీ శ్రుతి ఓజా. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని...ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర హెల్త్ క్యాంప్ ఉంటుందన్నారు. ఎగ్జామ్ టైమింగ్స్‌ దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని.. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో హాల్ టికెట్లు ఇవ్వలేదనే ఫిర్యాదులు లేకుండా నేరుగా విద్యార్థులు ఆన్ లైన్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులు బాటు ఇచ్చారు.

6 / 7
ఈ ఏడాది 9 లక్షల 80వేల 978మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1521 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27 వేల 900 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. 1521 మంది చీప్ సూపర్డేట్స్ 200 మంది సీటింగ్ గార్డ్స్   ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యుత్తు, మంచినీటి సరఫరాతో పాటు, ప్రత్యేక వైద్య బృందాన్ని ఉంచుతున్నారు. అత్యవసర వైద్య సేవలకు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు.

7 / 7
మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే డిబార్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టనున్నట్లు తెలిపారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలని.. ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే విద్యార్థుల కోసం టెలి మానస్ పేరుతో14416 లేదా 1800-914416 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.