- Telugu News Photo Gallery Cricket photos IND Vs ENG Rohit Sharma led Indian Cricket Team India Break Pakistan And West Indies 30 Years Old Record
IND vs ENG: ఒకే దెబ్బకు మూడు దేశాలకు ముచ్చెమటలు.. రాంచీలో ఇచ్చి పడేసిన రోహిత్ సేన.. అదేంటో తెలుసా?
Team India: స్వదేశంలో అజేయంగా నిలిచిన టీమిండియా.. పాకిస్థాన్, వెస్టిండీస్‌లను అధిగమించి స్వదేశంలో అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉంది. ఇదే ఇప్పటి వరకు రికార్డ్‌గా నిలిచింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 27, 2024 | 10:06 AM

రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. స్వదేశంలో అజేయంగా ముందుకు సాగుతోంది. ఇంగ్లండ్‌పై ఈ టెస్టు సిరీస్ విజయం టీమిండియాకు 17వ టెస్టు సిరీస్ విజయంగా నిలిచింది.

దీంతో స్వదేశంలో అజేయంగా కొనసాగుతున్న టీమ్ ఇండియా.. స్వదేశంలో అత్యధిక సిరీస్ లు గెలిచిన జట్లలో పాకిస్థాన్, వెస్టిండీస్ లను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉంది.

కంగారూలు స్వదేశంలో 1993 నుంచి 2008 వరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోకుండా మొత్తం 28 టెస్టు సిరీస్‌లు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఇదే రికార్డు. దీని తర్వాత రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ 1982 నుంచి 1994 వరకు స్వదేశంలో సిరీస్‌ను కోల్పోయిన రికార్డును సొంతం చేసుకుంది.

India

పాకిస్థాన్‌తో పాటు వెస్టిండీస్ కూడా స్వదేశంలో 16 సిరీస్‌ల అజేయ రికార్డును కలిగి ఉంది. విండీస్ జట్టు 1974, 1994ల మధ్య ఈ ఘనతను సాధించింది. 17 సిరీస్‌లలో ఓటమి ఎరుగని భారత్.. పాకిస్థాన్, వెస్టిండీస్‌లను అధిగమించింది.

దీనికి ముందు, భారత్ 1987 నుంచి 1999 వరకు 14 సిరీస్‌లు, 2004 నుంచి 2012 వరకు వరుసగా 14 సిరీస్‌లలో అజేయంగా ఉంది. నేటికీ భారత్‌కు వచ్చిన ఏ జట్టుకైనా సిరీస్ గెలవడం అంత ఈజీ కాదని చాటి చెప్పింది.




