Offbeat Beaches in India: భారతదేశంలో ప్రసిద్ధ బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. అలాగే అనేక సంఖ్యలో ఆఫ్‌బీట్ బీచ్‌లు కూడా ఉన్నాయి. ఈ బీచ్‌లకు అనేక మంది సందర్శించడానికి వస్తుంటారు. వాటిలో కొన్ని ఆగస్టులో సందర్శించడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలో దేశంలోని అలాంటి ప్రధాన ఆఫ్‌బీట్ బీచ్‌లను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రొమెనేడ్ బీచ్: పుదుచ్చేరిలోని ప్రొమెనేడ్ బీచ్ చాలా ప్రముఖమైనది. సూర్యోదయ, సూర్యాస్తమ సమయాల్లో ఈ బీచ్ చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
రాధా నగర్ బీచ్: అండమాన్ ఆండ్ నికోబార్‌లోని రాధా నగర్ బీచ్ ఆసియాలోనే అత్యుత్తమమైన బీచ్. సూర్యస్తమ సమయంలో ఇక్కడ ప్రకృతి, వాతావరణం మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
గోకర్ణ: కర్ణాటకలోని గోకర్ణ బీచ్ అద్భుతమైన సముద్ర తీరాలలో ఒకటి. అందుకే ఈ బీచ్‌ని సందర్శించేందుకు మన దేశస్థులే కాక విదేశీయులు కూడా వస్తుంటారు.
అరాంబోల్ బీచ్: గోవాలోని అరాంబోల్ బీచ్ నైట్ లైఫ్‌ని ఎంజాయ్ చేసేవారికి ప్రసిద్ధి. ఈ కారణంగానే ఈ బీచ్‌ని చూసేందుకు దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.