
ఆ ఊరు మొత్తానికి ఒకే ఒక స్కూల్ అది కూడా మున్సిపల్ స్పెషల్ స్కూల్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏడు కాలువలు అనే గ్రామంలో సుమారు 1500 మంది ప్రజలు నివసిస్తుంటారు. ఆ ఊరు మునిసిపాలిటీలో ఉండడం కారణంగా గతంలో అక్కడ స్పెషల్ గా పాఠశాలను నిర్మించారు. ఆ ఊర్లో నివసిస్తున్న వారు ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్ పై మోజు చూపడంతో పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు.

ఆ మున్సిపల్ స్కూల్లో మాత్రం ఒకే ఒక విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నాడు.. స్వతంత్ర దినోత్సవం విశిష్టతను విద్యార్థికి తెలియజేసేందుకు ఒక విద్యార్థి చదివే ఆ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.అలాగే సుమారు 30 మంది వరకు గెస్ట్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పైగా అంగన్వాడి చిన్నారులు కూడా రావడంతో వేడుకలుమరింత ఘనంగా జరిగాయి. పిఠాపురం మున్సిపాలిటీ 14వ వార్డులో గల భాస్కర స్పెషల్ మున్సిపాలిటీ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థితో జండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

స్కూల్ మాస్టర్ గండేపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక విద్యార్థితో నిర్వహించిన వేడుకలకు సుమారు 30 మంది అతిధులు హాజరయ్యారు.. మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన వేడుకలకు స్కూల్ విద్యార్థితో పాటు నలుగురు అంగన్వాడి చిన్నారులను కూడా అంగన్వాడీ టీచర్ రామ తులసి తీసుకువచ్చారు.

జెండా వందన కార్యక్రమం అనంతరం వచ్చిన వారంతా స్వీట్లు పంచుకొని పంద్రాగస్టు వేడుకల్లో పాలుపంచుకున్నారు. తన అబ్బాయి మాత్రమే చదువుతున్న ఈ స్కూల్లో స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరపడం దానికి 30 మంది పెద్దలు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థి తల్లి కుడిపూడి శ్యామల తెలిపారు.

ఒక విద్యార్థి ఉన్నప్పటికీ విద్యార్థి భవిష్యత్తు కోసం ప్రభుత్వం పాఠశాల నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న పాఠశాల ఉపాధ్యాయుడు గండేపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు.. పాఠశాల వారు నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అంగన్వాడీ పిల్లలను కూడా తీసుకురావడం ఒక పిల్లవాడు కోసం ఘనంగా వేడుకలు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు అంగన్వాడి టీచర్ రామ తులసి..