- Telugu News Photo Gallery Independence day 2022 Virat Kohli Sachin Tendulkar Rohit Sharma MS Dhoni change social media profile photo indian flag tricolor Telugu Sports News
Independence day 2022: మేరా భారత్ మహాన్..స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో టీమిండియా క్రికెటర్లు..
Independence day 2022: నేడు దేశం మొత్తం 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా ఇళ్లు, ఆఫీసులను మువ్వన్నెల జెండాలతో అలంకరించారు. ప్రధాని పిలుపు ఇచ్చిన ఈ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్లు కూడా భాగమయ్యారు.
Updated on: Aug 15, 2022 | 10:58 AM

నేడు దేశం మొత్తం 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా ఇళ్లు, ఆఫీసులను మువ్వన్నెల జెండాలతో అలంకరించారు. ప్రధాని పిలుపు ఇచ్చిన ఈ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్లు కూడా భాగమయ్యారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సైనా నెహ్వాల్ తదితర క్రీడాకారులు తమ సోషల్ మీడయా డీపీలను త్రివర్ణ పతాకంగా మార్చేశారు.

చాలా మంది భారతీయ క్రీడాకారులు సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ ఫోటోలను మార్చడం ద్వారా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకున్నారు. ముఖ్యంగా ఏడాదికి 1-2 సార్లు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎంఎస్ ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ ఫోటోను మార్చి త్రివర్ణ పతాకాన్ని ఉంచాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొద్ది రోజుల క్రితమే మువ్వన్నెల జెండాను తన ప్రొఫైల్ పిక్‌గా మార్చేశారు. తన ఇంటిపై కూడా జాతీయ జెండాను ఎగరవేశాడు.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా భాగమయ్యాడు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫైల్ చిత్రంలో త్రివర్ణ పతాకాన్ని ఉంచాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ప్రొఫైల్ చిత్రాన్ని మువ్వెన్నెల జెండాగా మార్చుకున్నాడు.

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆగస్టు 15న తన ప్రొఫైల్ ఫొటోను మార్చేసి త్రివర్ణ పతాకాన్ని ఉంచింది.

సురేష్ రైనా, శిఖర్ ధావన్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, శివమ్ మావి, ఛటేశ్వర్ పుజారా, అమిత్ మిశ్రా కూడా తమ ప్రొఫైల్ పిక్‌లను మార్చేసి మువ్వన్నెల జెండాకు చోటిచ్చారు.




