IND vs SA: అప్పుడు విరాట్‌.. ఇప్పుడు పంత్‌.. సేమ్‌ టు సేమ్‌ ఐదేళ్ల నాటి చరిత్ర రిపీట్..

|

Jun 10, 2022 | 5:23 PM

యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు భారత టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.

1 / 6
తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టును దక్షిణాఫ్రికా ఓడించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ గాయపడటంతో రిషబ్ పంత్ తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.  అయితే కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాడు పంత్‌. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని ఆశ్చర్యకరమైన, యాదృచ్ఛిక సంఘటనలు చోటుచేసుకున్నాయి

2 / 6
కాగా పంత్ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్‌గా తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయాడు. 2017లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో కోహ్లి తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

3 / 6
కోహ్లీ, పంత్‌లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోవడం యాదృచ్ఛికం. ఇద్దరూ తమ కెప్టెన్సీలో లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు.

4 / 6
ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పంత్ 29 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి T20I కెప్టెన్సీ మ్యాచ్‌లో కోహ్లీ కూడా 29 పరుగులు చేయడం గమనార్హం.

5 / 6
జూన్ 12న కటక్‌లో జరగనున్న రెండో మ్యాచ్‌లోనైనా పంత్‌ టీమిండియాను విజయాల బాటలో నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

6 / 6
కే ఎల్ రాహుల్ గాయపడడంతో రిషభ్ పంత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.