Pineapple: పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదా..? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పైనాపిల్‌ను అనాస పండు అని కూడా అంటారు. పుల్లగా, తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి. పైనాపిల్‌తో ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




