Fish Oil: ఫిష్ ఆయిల్ తీసుకుంటే ఇన్ని లాభాలా..? ఇందులో ఉండే పోషకాలు ఇవే..!
మంచి ఆరోగ్యం కోసం మంచి పోషకాహారం చాలా ముఖ్యం. ఆహారంతో పాటుగా శరీరానికి కొన్ని రకాల నూనెలు, కొవ్వులు కూడా తప్పనిసరిగా అవసరం. మంచి కొవ్వులు అనేవి శరీర కండరాలకి అవసరం. వాటిలో ఒకటే చేప నూనె. ఆహారంలో చేపల్ని తరచూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన చేప నూనె సమృద్ధిగా అందుతుంది. లేదంటే.. చేప నూనె సప్లిమెంట్స్‌ని తీసుకోవడం వల్ల కూడా అందుతుంది. ఫిష్ ఆయిల్ అనేది చేపల నుంచి తీసిన ఒక రకమైన నూనె. ఇందులో ఉండే పోషకాలు.. లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 31, 2025 | 10:57 AM

ఫిష్ ఆయిల్‌లోని గుణాలు హార్ట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, ఇతర హెల్త్ బెనిఫిట్స్ అనేకం ఉన్నాయి. ఫిష్ ఆయిల్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది అనేక చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించడంలో సాయపడుతుంది. ఒక గ్రాము ఫిష్ ఆయిల్‌లో సుమారు 300 నుంచి 500 మిల్లీగ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

చేపనూనెలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీంతో అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే మీ గుండె ఆరోగ్యం, బ్రెయిన్ హెల్త్‌తో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఫిష్ ఆయిల్‌తో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చేపనూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఐకోసాపెంటోనోయిక్ ఆమ్లం, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం. ఇది ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడంలో మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఇది గుండె జబ్బులా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఫిష్ ఆయిల్‌తో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫిష్ ఆయిల్ క్యాప్సుల్‌లో 400 నుంచి1000 ఐయూ పరిమాణంలో విటమిన్ డి లభిస్తుంది. ఎముకలను బలంగా మార్చడంలో ఇది సహాయపడుతుంది. విటమిన్ డి కాల్షియం శోషణను కూడా మెరుగుపరుస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఐకోసపెంటెనోయిక్ ఆమ్లం, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం చాలా లాభాలున్నాయి.

ఫిష్ ఆయిల్‌లో విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కంటిని ఆరోగ్యంగా మార్చుతుంది. ఫిష్ ఆయిల్ తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు రావు. కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ఫిష్ ఆయిల్‌లో ఫిష్ ఆయిల్ సెలీనియం అధికంగా లభిస్తుంది. ఇది ఒక బలమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది. వ్యాధినిరోధకశక్తిని బలంగా మార్చుతుంది. ఫిష్ ఆయిల్‌లో అతి తక్కువ మోతాదులో కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా మార్చుతుంది.




