ఎలాంటి వ్యాధి లేని జీవితం కావాలంటే, ప్రతిరోజూ ఒక గ్లాసు ఈ జ్యూస్ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరం లోపల నుండి డిటాక్సిఫై చేస్తుంది. ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. బీట్‌రూట్ దుంప తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. క్యారెట్ కూడా పీల్ తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ తరిగిన క్యారెట్, బీట్‌రూట్, యాపిల్ గుజ్జును మిక్స్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా అల్లం జోడించవచ్చు.