ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది హింసాత్మక, భయానక సినిమాలు చూడటానికే ఇష్ట పడుతున్నారు. ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ కే రెస్పాన్స్ కూడా ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంటున్నాయి. కానీ సినిమాల్లో చూపించే హింస.. ఒక మనిషిని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొన్ని సినిమాల్లో అయితే డైలాగ్స్, కొన్ని సన్నివేశాలు మరీ అసభ్యంగా ఉంటున్నాయి. ఇలాంటివే యూత్ కి కూడా నచ్చుతున్నాయి.
తాజాగా హింసాత్మక సినిమాలపై చేసిన అధ్యయనం ప్రకారం.. ఈ సినిమాలు చూడటం వల్ల మనిషిలో పలు రకాల భావోద్వాలకు కారణం అవుతుంది. హింసాత్మక సినిమాలు చూడటం వల్ల ఆందోళన, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం, కోపం, మాట తీరులో కూడా తేడాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
పలు రకాల హింసాత్మక సినిమాలు, వెబ్ సిరీస్ చూడటం వల్ల చాలా మందిలో భయం, ఆందోళన నెలకొంంటాయి. ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అంతే కాకుండా మాసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి. ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు.
హింసాత్మక సినిమలు చూటం వల్ల కొందరిలో దూకుడు స్వభావం పెరుగుతుంది. ఎవరినీ కేర్ చేయకుండా.. వారి పనులు వారు చేస్తారు. కుటుంబ సభ్యులు, బయటి వ్యక్తులతో కూడా దూకుడుగా మాట్లాడతారు.
హింసాత్మక సినిమాలు చూడటం వల్ల వాటిపైనే మనసులో, మెదడులో పలు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీని వల్ల నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. పదే పదే సినిమాల్లోని సీన్లు పీడ కలలుగా వస్తాయి.