- Telugu News Photo Gallery If you want to stay healthy during summer, you should definitely drink these drinks
Summer Care: సమ్మర్‌లో వేడికి చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్స్ తప్పనిసరి తీసుకోవాలి..
వేసవి కాలంలో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. దీని వల్ల డీహైడ్రేషన్, అలసట, వడదెబ్బ, డయేరియా బారిన పడటం, వడదెబ్బ తినడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. రీఫ్రెష్‌గా ఉండే పానీయాలు తాగాలి. వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు పోతుంది. త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు..
Updated on: Apr 01, 2024 | 3:14 PM

వేసవి కాలంలో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. దీని వల్ల డీహైడ్రేషన్, అలసట, వడదెబ్బ, డయేరియా బారిన పడటం, వడదెబ్బ తినడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. రీఫ్రెష్‌గా ఉండే పానీయాలు తాగాలి.

వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు పోతుంది. త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నీటిని తాగుతూ ఉండాలి. పిల్లల చేత కూడా తాగిస్తూ ఉండాలి. ఫ్రిజ్ వాటర్ కంటే కుండలోని నీరు తాగడం మంచిది.

పెరుగు, మజ్జిగ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇవి తాగితే శరీరానికి చలువ చేస్తుంది. బెల్లాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి. బెల్లం తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత పెరుగుతుంది. దీంతో శక్తి లభిస్తుంది.

అలాగే బార్లీ వాటర్ కూడా తాగుతూ ఉండాలి. ఇవి తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. గ్రీన్ టీ కూడా తీసుకుంటూ ఉండాలి. గ్రీన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణగా నిలుస్తాయి.

అదే విధంగా కొబ్బరి నీటిని తీసుకోవాలి. కోకోనెట్ వాటర్‌లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఉంటాయి. ఇవి శరీరంలోని శక్తిని పెంచుతాయి. ద్రాక్ష రసం తీసుకున్నా ఆరోగ్యంగా ఉండొచ్చు.




