
ఉన్నపలంగా అలసిపోతుంటే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో సరిపడ ఎర్రరక్తకణాలు లేకపోతే శరీరం త్వరగా అలసిపోతుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్లే ఎర్రరక్త కణాలు లేకపోతే త్వరగా అలసిపోతుంటారు.

త్వరగా అలసిపోవడానికి ధైరాయిడ్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే.. అలసట ప్రారంభమవుతుంది. హార్మోన్లు తక్కువగా విడుదల కావడం వల్ల జీవక్రియ మందగిస్తుంది, దీనిని హైపోథైరాయిడిజం అంటారు. ఈ కారణంగా శరీర కండరాల్లో అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డయాబెటిస్ బారిన పడిన వారు కూడా త్వరగా అలసిపోతుంటారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల శరీరం గ్లూకోజ్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతుంది, దీని కారణంగా ఇది రక్తంలో కరిగిపోయి అలసటను కలిగిస్తుంది.

ఇక త్వరగా అలసిపోవడానికి మరో కారణం డిప్రెషన్. ఇటీవల ఈ సమస్య బాగా ఎక్కువుతోంది. శారీరక శ్రమ కంటే, మానసిక ఒత్తిడి కారణంగా అలసిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒత్తిడి కారణంగా తరచూ అలసిపోతుంటారు.

శరరీరం త్వరగా అలసిపోవడానికి మరో ప్రధాన కారణం.. అర్థరైటిస్. శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలపై ఆర్థరైటిస్ దాడి ఎముకలత పాటు కణాలపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా శరీరం త్వరగా అలసిపోయిన భావన కలుగుతుంది.

నిద్రలేమి కూడా అలసటకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోకపోతే అది రోజంతా ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో నిత్యం అలసిపోయినట్లు కనిపిస్తారు.