
సాధారణంగా మనం ఉపయోగించే కూరగాయల్లో ఉల్లిపాయలు కూడా ఒకటి. మనం ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయల్ని వంట్లలో ఉపయోగిస్తాం.ఉల్లిపాయల్లో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభ్యమవుతాయి. వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి.

ఎర్ర ఉల్లిపాయలతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చా? హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా? అని చాలా మందికి డౌంట్ ఉంటుంది. ఉల్లిపాయలతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. జుట్టు రాలకుండా, చుండ్రు తగ్గడానికి, జుట్టు సాఫ్ట్‌గా, షైనీగా ఉండేందుకు ఈ ఉల్లిపాయలు చాలా హెల్ప్ చేస్తాయి.

ఎర్ర ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా లభ్యమవుతాయి. ఇవి జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఎర్ర ఉల్లిపాయల పేస్టును నెత్తి మీద రాస్తే.. రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అలాగే కుదుళ్లకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

ఎర్ర ఉల్లిపాయల్ని జుట్టుకు ఉపయోగించడం వల్ల తలపై ఉండే మంట తగ్గుతుంది. అలాగే జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. అలాగే చుండ్రుకు కారణం అయ్యే బ్యాక్టీరియా, శిలీంధ్రాలను నాశనం చేస్తుంది. జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది.

రెండు లేదా మూడు చిన్న ఎర్ర ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి.. మెత్తని పేస్టులా చేయాలి. ఆ తర్వాత ఈ పేస్టును వడకట్టి.. రసం తీయాలి. ఈ రసాన్ని తలపై పట్టించి.. సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా వారంలో ఒక్కసారైనా చేస్తే.. జుట్టు బాగా పెరుగుతుంది.