Bhringraj Oil Benefits: జుట్టు సమస్యలను పటాపంచలు చేసే భృంగరాజు..

Edited By: TV9 Telugu

Updated on: Dec 18, 2023 | 7:17 PM

మనిషి అందాన్ని రెట్టింపు చేయడంలో జుట్టుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందమైన.. ఒత్తైన.. ఆరోగ్య వంతమైన, పొడవైన జుట్టు ఉండాలని అనుకోని వారుండరు. ఇలా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పటాపంచలు చేసేదే భృంగరాజు. దీన్నే స్థానికంగా 'గుంటగలిజేరు' అని కూడా అంటారు. జుట్టు పెరగడానికి, పిత్త దోషాల నివారణకు భృంగ రాజు బాగా ఉపయోగ పడుతుంది. దీన్ని 'మూలికల్లో రారాజు'గా ఆయుర్వేదంలో చెప్పబడ్డారు. భృంగరాజుతో ఎలాంటి లాభాలు..

1 / 5
మనిషి అందాన్ని రెట్టింపు చేయడంలో జుట్టుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందమైన.. ఒత్తైన.. ఆరోగ్య వంతమైన, పొడవైన జుట్టు ఉండాలని అనుకోని వారుండరు. ఇలా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పటాపంచలు చేసేదే భృంగరాజు. దీన్నే స్థానికంగా 'గుంటగలిజేరు' అని కూడా అంటారు. జుట్టు పెరగడానికి, పిత్త దోషాల నివారణకు భృంగ రాజు బాగా ఉపయోగ పడుతుంది. దీన్ని 'మూలికల్లో రారాజు'గా ఆయుర్వేదంలో చెప్పబడ్డారు. భృంగరాజుతో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
చాలా మందిలో జుట్టు పెరుగుదల అనేది నిలిచిపోతుంది. ఇలాంటి వారు నువ్వుల నూనె, బాదం ఆయిల్, కొబ్బరి ఆయిల్ తో భృంగ రాజు ఆకులను కలిపి జుట్టుకు రాస్తే.. జుట్టు కుదుళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

3 / 5
చిన్న వయసులోనే చాలా మందిలో జుట్టు తెలబడటాన్ని గమనించే ఉంటారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. భృంగ రాజును కొబ్బరి లేదా బాదం నూనెతో కలిపి రాస్తే జుట్టు నెరవదు. అందే కాకుండా చుండ్రును కూడా అదుపులోకి తీసుకొస్తుంది.

4 / 5
గుంటగలిజేరు ఆకు కలిపిన తైలాన్ని రాసుకుంటే.. మంచి విశ్రాంతి లభిస్తుంది. నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ తైలాన్ని రాసుకుంటే కండరాలకు మంచి రిలాక్సేషన్ దొరికి.. మంచి నిద్ర పడుతుంది.

5 / 5
భృంగ రాజుతో చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. ఈ మొక్కలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులను నూనెలో కలిపి చర్మానికి మర్దనా చేసుకుంటే.. డెర్మటైటిస్, మొటిమలు, సోరియాసిస్ వంటి వాటిని తగ్గించు కోవచ్చు. అయితే ఈ ఆయిల్ ని చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఉపయోగించ కూడదు.