
మనలో చాలా మందికి పెంపుడు జంతువులంటే అమితమైన ఇష్టం. వాటికి చక్కని పేర్లు పెట్టి ఇంట్లో మనుషుల్లా చూస్తుంటారు. ఆహారం విషయంలో, ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాం. పెంపుడు జంతువులు కూడా వయసు పెరిగాక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, కీళ్లనొప్పులు, కీళ్ల వ్యాధులు, గుండె జబ్బులు, డిమెన్షియా, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తుంటాయట. కుక్కలను ఎంత ప్రేమగా పెంచినా.. వాటి శారీరక, మానసిక స్థితి వల్ల కరవడానికీ వెనుకాడవు. ఇటీవల కాలంలో పెంపుడు కుక్కలు కూడా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జంతు ప్రేమికులు తమ పెడ్ డాగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. వర్షాకాలంలో పెంపుడు జంతువుల ఆరోగ్యంపై అధిక శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈ కాలంలో మనుషుల్లాగే పెంపుడు జంతువులు కూడా అధికంంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలంలో మీ పెట్ డాగ్‌ను తీసుకుని బయటకు వాకింగ్‌కు వెళ్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి..
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.