బ్రోకలీ కర్రీ ఇలా చేస్తే.. తస్సాదియ్యా.. ముద్ద ముద్దకు వావ్ అనాల్సిందే

Updated on: Mar 30, 2026 | 9:17 AM

Broccoli curry recipe in Telugu: బ్రోకలీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇద ఆరోగ్యకరమైనదిగా మాత్రమే కాకుండా అదిరిపోయే వంటకం కూడా. దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
ముందుగా బ్రోకలీని రెడీ చేసుకోవాలి: బ్రోకలీని తీసుకుని వాటిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే, వీటిని ఉప్పులో 5 నిమిషాలు బాగా నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని వంపి పక్కన పెట్టాలి.

2 / 5
తాలింపు ఈ విధంగా పెట్టుకోవాలి:  ఇక ఇప్పుడు పాన్‌లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, అది వేడయ్యాక దానిలో అరటేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు వేసి తాలింపు పెట్టాలి.

3 / 5
ఉల్లిపాయ ముక్కలను రెడీ చేసుకోవాలి:  ఆ తర్వాత బాగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా  వేయించాలి. ఉల్లిపాయలు ముక్కలు బంగారు కలర్లోకి  వచ్చే వరకు వాటిని బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5
మాసాలు రెడీ చేసుకోవాలి : అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్  కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. ఇంకా వీటిలో రుచి కోసం టమాటా ముక్కలు  వేసుకోవచ్చు. మసాలా పొడులు కూడా వేసి ఐదు నిమిషాల పాటు  వేయించాలి.

5 / 5
బ్రోకలీని ఈ విధంగా ఉడికించాలి:  ఉల్లిపాయలు, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత  బ్రోకలీ ముక్కలు కూడా వాటిలో  వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు వాటిని బాగా మగ్గేలా ఉడికించాలి. చివర్లో గరం మసాలా కూడా వేసి వాటిలో బాగా కలపాలి. కొత్తిమీర చల్లి కిందకు దించేయాలి.

Follow Us