
చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు : చికెన్ కేజీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్, కొబ్బరి తురుము ఒక కప్పు, పచ్చి మిర్చి నాలుగు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వన్ టీ స్పూన్. రుచికి సరిపడ ఉప్పు, కారం, చిటికెడు పసుపు, కొబ్బరి నూనె, చింత పండు నిమ్మకాయ సైజు.

తయారీ విధానం : ముందుగా కొబ్బరి తురుము, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పాయ ముక్కలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, రెండు టీ స్పూన్‌ల కొబ్బరి నూనె వేసి, అందులో పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

దీని తర్వాత కేజీ చికెన్ ముక్కలను వేసి, మంచిగా వేయించుకోవాలి. ముక్క ఉడికే వరకు కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ, మంచిగా ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి మంచిగా కలపాలి.

ముక్క కొంచెం ఉడికిన తర్వాత, కొబ్బరి తురుము వేయాలి. మరో ఐదు నిమిషాల తర్వాత చింత పండు రసం వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కనీసం 10 నిమిషాలు కర్రీ ఉడకనివ్వాలి. అంతే టేస్టీ టేస్టీ గోవా స్టైల్ చికెన్ కర్రీ రెడీ.