
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చాలా మంది నాన్ వెజ్‌కు గుడ్ బై చెప్పి, డిఫరెంట్ టైప్ వెజ్ ఐటమ్స్ తయారు చేసుకుంటారు. ఇక మరీ ముఖ్యంగా కాలీ ఫ్లవర్ 65 లేదా పకోడి చేసుకొని తినడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాగా, మనం ఇప్పుడు మనం సుగంధ ద్రవ్యాలతో కాలీఫ్లవర్ 65 లేదా పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు : ఉప్పు రుచికి సరిపడ,పసుపు 1/4,నీళ్లు 1/2 లీటర్, కాలీ ఫ్లవర్ 1,కారం పొడి 1 టీ స్పూన్,ధనియాల పొడి 1 టీస్పూన్,జీలకర్ర, పొడి 1 టీస్పూన్,మిరియాల పొడి 1/2 టీ స్పూన్,పసుపు పొడి 1/4 టీ స్పూన్,మొక్క జొన్న పిండి 2 టేబుల్ స్పూన్స్,శనగపిండి,1 టేబుల్ స్పూన్,ఉప్పు రుచికి సరిపడ,అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్,మినపప్పు పిండి 1 టీస్పూన్, నూనె వెయించడానికి సరిపడ

తయారీ విధానం : ముందుగా కాలీఫ్లవర్ ను పెద్ద ముక్కలగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో 1/2 నీళ్లు పోసి రాతి ఉప్పు, పసుపు వేసి స్టవ్ మీద ఉంచాలి. నీరు బాగా మరిగే క్రమంలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీటి నుంచి కాలీఫ్లవర్ తీసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత మరో పాత్రలో కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, మొక్కజొన్న పిండి, శనగపిండి, రుచికి సరిపడ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీస్పూన్ల నూనె వేయాలి. తర్వాత పచ్చి శనగపిండి వేసి కొద్ది కొద్దిగా నీరు పోస్టూ పేస్ట్ లా కలపాలి.

తర్వాత కాలీఫ్లవర్ పేస్ట్ లో వేసి పేస్ట్ పీస్‌లకు పట్టేలా కలిపాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దానిని వేయించడానికి అవసరమైన నూనె వేసి వేడి చేసి కాలీఫ్లవర్ బంగారం లేదా గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే వేడి వేడి కాలీఫ్లవర్ పకోడి రెడీ.