Credit Score: సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే చాలు..

Updated on: Dec 21, 2025 | 9:53 AM

చాలా మంది ప్రతి నెల తమ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలోనే చెల్లిస్తారు. అయినా తమ క్రెడిట్ స్కోరు పెరగడం లేదని.. 500 లేదా 600 దగ్గరే ఆగిపోయిందని ఆందోళన చెందుతుంటారు. అసలు సమస్య చెల్లింపుల్లో మాత్రమే లేదు.. మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లలో దాగి ఉంది. మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీసే ఆ 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
గడువు దాటాక కడుతున్నారా?: ఒక రోజు ఆలస్యమైతే ఏమవుతుందిలే అనుకోవడం పెద్ద పొరపాటు. మీరు డ్యూ డేట్ దాటిన తర్వాత కట్టే ప్రతి రూపాయి మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఆలస్య చెల్లింపుగా నమోదవుతుంది. ఇది మీ స్కోర్‌పై శాశ్వత ముద్ర వేస్తుంది. దీనికి పరిష్కారం ఆటో-డెబిట్ ఆప్షన్ పెట్టుకోవడం.

2 / 5
క్రెడిట్ కార్డు ఫుల్: మీ కార్డు లిమిట్ లక్ష రూపాయలు ఉంటే.. మీరు అందులో రూ.70,000 - రూ.80,000 ఖర్చు చేస్తున్నారా? మీరు మొత్తం బిల్లు కడుతున్నప్పటికీ లిమిట్‌లో 30శాతం కంటే ఎక్కువ వాడితే బ్యాంకులు మిమ్మల్ని ఆర్థిక ఒత్తిడిలో ఉన్న కస్టమర్‌గా పరిగణిస్తాయి. మీ వినియోగాన్ని 30 శాతం లోపే ఉంచుకుంటే స్కోరు వేగంగా పెరుగుతుంది.

3 / 5
సెటిల్‌మెంట్ ట్యాగ్: గతంలో ఏదైనా లోన్ కట్టలేక బ్యాంకుతో సెటిల్‌మెంట్ చేసుకున్నారా..? సెటిల్‌మెంట్ అంటే బ్యాంకు తన బాకీలో కొంత వదులుకుందని అర్థం. ఇది మీ రిపోర్ట్‌లో Settled అని కనిపిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో కొత్త లోన్లు రావడం కష్టమవుతుంది. పాత బకాయిలను పూర్తిగా క్లియర్ చేసి No Dues Certificate తీసుకోవడం ఉత్తమం.

4 / 5
పదే పదే అప్లై: మీరు లోన్ లేదా కార్డు కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ బ్యాంక్ మీ రిపోర్ట్‌ను తనిఖీ చేస్తుంది. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. తక్కువ కాలంలో ఎక్కువ బ్యాంకుల చుట్టూ తిరిగితే, మీకు డబ్బు అత్యవసరంగా అవసరమని భావించి బ్యాంకులు మీ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేస్తాయి. ఇది మీ స్కోర్‌ను మరింత తగ్గిస్తుంది.

5 / 5
క్రెడిట్ మిక్స్: కేవలం పర్సనల్ లోన్లు మాత్రమే ఉండటం కంటే.. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్ల మిశ్రమం ఉంటే మీ ప్రొఫైల్ బలంగా ఉంటుంది. అసలు లోన్లే లేకపోయినా క్రెడిట్ హిస్టరీ లేక స్కోరు పెరగదు.