SkinCare: సమ్మర్ టాన్‌కు గుడ్‌బై.. వారానికి 2 సార్లు ఇలా చేస్తే.. ముఖం మిళమిళా మెరవాల్సిందే!

Updated on: May 22, 2026 | 12:18 PM

బయట ఎండలు మండిపోతున్నాయి. మార్నింగ్ 8 అయిందంటే చాలూ భానుడు భగ్గమంటున్నాడు. ఈ ఎండలో బయటకెళ్లడం ద్వారా UV కిరణాల ప్రభావంతో చర్మంలో మెలనిన్ పెరిగి, ముఖం, చేతులు క్షణాల్లో నల్లగా మారుతాయి. కానీ దీన్ని లైట్‌ తీసుకుంటే అవి అలాగే నల్లమచ్చల్లా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎండవల్ల నల్లగా మారిన చర్మాన్ని ఖరీదైన క్రీములు వాడకుండా ఇంట్లోనే మనం మెరిసేలా చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
కలబంద జెల్: చర్మ ఆరోగ్యానికి కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి తాజా కలబంద ఆకు నుండి తీసిన జెల్‌ను ముఖానికి, చేతులకు మందంగా పూసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో కడిగేయాలి. ఇది ఎండ వల్ల కలిగే చికాకును తగ్గించి, చర్మం పాత రంగును తిరిగి తెస్తుంది. కలబందలోని అలోయిన్ అనే సమ్మేళనం మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించి, నల్ల మచ్చలు మరియు పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2 / 5
టమాటా రసం:  సగం టమాటాను బాగా మెత్తగా చేసి, ఆ రసం, గుజ్జును నేరుగా ముఖానికి, చేతులకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. టమోటాలలో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, సూర్యరశ్మి వల్ల కలిగే చర్మం నల్లబడటం, ఎరుపుదనం, టానింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
పసుపు - పెరుగు ప్యాక్: పుసుపు, పెరుగు కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల సాదా పెరుగులో చిటికెడు పసుపు కలిపి, నల్లబడిన భాగాలపై పూయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం మృత కణాలను తొలగించే సహజ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. పసుపులోని కర్కుమిన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మం నల్లబడటాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

4 / 5
శనగపిండి - పచ్చి పాలు : రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తగినంత పచ్చి పాలతో కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. దీన్ని రాసుకుని 15 నిమిషాల తర్వాత, చేతులను నీటితో తడి చేసి గుండ్రంగా రుద్దుతూ కడిగేయాలి. శనగపిండి చర్మంపై ఉన్న మురికిని తొలగిస్తుంది. పాలలో ఉండే కొవ్వులు, పోషకాలు కొత్త చర్మ కణాలు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడతాయి.

5 / 5
తేనె - నిమ్మరసం మిశ్రమం : ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని, ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనెతో కలిపి నల్ల మచ్చలపై రాయాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి మొండి నల్ల మచ్చలను తొలగిస్తుంది. తేనె చర్మాన్ని పొడిబారకుండా తేమగా ఉంచుతుంది.  వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే మీ ఇంట్లో సహజంగా చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. (Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి..వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించండి)

Follow Us