
తమిళనాడు స్పెషల్ వంటకాల్లో మటన్ దోశ కూడా ఒకటి. ఇది నోటికి చాలా రుచికరంగా ఉంటుందంట. అంతే కాకుండా ఒక్కసారి చేసి తిన్నారంటే, నాన్ వెజ్ ప్రియులు మళ్లీ మళ్లీ ఇష్టంగా చేసి తింటారంట. కాగా, ఇప్పుడు మనం రుచికరమైన తమిళనాడు మధురై స్టైల్‌లో మటన్ దోశ, ఇంటిలోనే చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : దోశ పిండి, మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, ఉల్లిపాయలు, కోడి గుడ్లు, మిరియాల పొడి, నూనె, ఉప్పు, పసుపు, కొత్తిమీర.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కీమా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు వేయాలి. తర్వాత మటన్ కీమా వేసి మంచిగా కలుపుకోవాలి.

మటన్ కీమా వేసి అది కాస్త ఉడికిన తర్వాత అందులో కారం, మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి మరికొన్ని నీళ్లు పోసి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అది బాగా ఉడికే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. మటన్ కీమా ఉడికిపోతుంది. దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అందులో కోడి గుడ్లు వేసి గిలక్కొట్టాలి,

ఇందులో కొన్ని పచ్చి ఉల్లిపాయల ముక్కలు ,కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోశ పిండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దోశ వేసుకోవాలి. తర్వాత దాని పై నుంచి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కీమా మిశ్రమం వేసుకోవాలి. దోశను రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. తర్వాత దీనిని తినాలి అంతే టేస్టీ టేస్టీ మటన్ దోశ రెడీ.