
చలికాలంలో ముఖం గరుకుగా, పొడిగా మారుతుంది. ఈ కాలంలో ముఖం సహజ కాంతిని పొందడానికి ఎన్ని ప్రయత్నాల చేసినా ఫలితం కనిపించదు. అందుకే శీతాకాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల శరీరం పాడైపోవడంతోపాటు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి.

ముఖ్యంగా ముఖం సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ముఖం శుభ్రం చేయడం నుంచి ఆహారం వరకు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజూ ఉదయాన్నే నిద్రలేచి ముఖం కడుక్కుంటే ముఖంపై ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి రసాయనాలు లేని సహజసిద్దమైన ఫేష్ వాష్ ఉపయోగించాలి. ఇది మార్కెట్లో దొరికే ఫేస్ వాష్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే..

జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా ఇది మంచిది. ఒక చెంచా శెనగపిండిలో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. దీనిలో 10 చుక్కల గ్లిజరిన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఫ్రిజ్‌లో ఉంచండి. ముఖాన్ని నీటితో కడిగి, టవల్‌తో బాగా తుడుచుకుని ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.

10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంలో గ్లో పెరగడంతోపాటు, మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోతాయి. మార్కెట్‌లో ఉన్న ఏ ఫేస్ వాష్ ఇంత కంటే బెటర్‌గా పని చేయదు.

ఆ తర్వాత రెండు చుక్కల గ్లిజరిన్‌లో, రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖమంతా అప్లై చేసుకోవాలి. 5 నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి. ఇక ఈ కాలంలో బయటకు వెళ్లే ముందు కొద్దిగా సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మర్చిపోకూడదు.