ఈవినింగ్ స్నాక్స్‌కు బెస్ట్.. బియ్యం పిండితో చెగోడీలు ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్దీ!

Updated on: Jun 04, 2026 | 4:27 PM

సాయంత్రం అయ్యిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ సాయంత్రం స్నాక్స్‌గా ఏదో ఒకటి తినాలి అనుకుంటారు. ముఖ్యంగా చెగోడిలు చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరీ మీరు కూడా మీ ఫ్యామిలీ వారికోసం బయట కొనుగోలు చేయకుండా ఇంటిలోనే చెగోడీలు చేయాలి అనుకుంటున్నారా? అయితే పక్కా కొలతలతో ఇలా చేయండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి.

1 / 5
కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బియ్యం పిండి, రెండు టీ స్పూన్స్ మైదా లేదా శనగపిండి. నువ్వులు  ఒక టీ స్పూన్, వాము ఒక టీస్పూన్, పసుపు చిటికెడు, నెయ్యి వన్ టీస్పూన్, వాటర్ కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడ.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. దానిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కప్పు వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులోనే చిటికెడు పసుపు, వాము, నువ్వులు, నెయ్యి వేసి  పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. నీళ్లు వాము అన్నీ వేసుకున్న కడాయిని పెట్టి, నీరు మరిగేలా చూసుకోవాలి. నీరు మరీ బాగా మరగాల్సిన పని లేదు. ఒక పొంగులా వస్తే సరిపోతుంది. ఇలా నీరు పొంగులా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి.

3 / 5
మనం బియ్యం పిండిని వేసుకోవడానికి ముందే, రెండు టీ స్పూన్ల మైదా లేదా శనగపిండిని బియ్యం పిండిలో మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరిగే నీటిలో ఈ పిండిని వేయాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే చెగోడీలు చాలా రుచికరంగా వస్తాయి. అంతే కాకుండా కరకరమంటాయి.

4 / 5
మనం మంచిగా కలుపుకున్న పిండిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని అది వేడిగా ఉన్న సమయంలో మంచిగా మెత్తగా కలుపుకోవాలి. దాదాపు 15 నిమిషాల వరకు పిండి మెత్తబడే వరకు కలుపుతూ ఉండాలి. పిండి మంచిగా కలిసిన తర్వాత దానిని తీసుకొని రింగుల మాదిరి చుట్టుకోవాలి.

5 / 5
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరపిడ నూనె వేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చెగోడీలను వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని వేరే ప్లే్ట్‌‌లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ  చెగోడీలు రెడీ.

Follow Us