Head Lice Remedies: తలలో పేలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌తో ఒక వారంలోనే వదిలించుకోండి..

|

Feb 29, 2024 | 8:33 AM

తలలో పేను సమస్య ఏ మనిషికైనా వచ్చే సాధారణ సమస్య. ఈ పేలు చాలా చిన్న జీవులు.. అయినా సరే ఇవి పెట్టె ఇబ్బంది అంతా ఇంతాకాదు. తలలో పేలు ఉంటే ఒకటే దురద పెడుతుంది. రక్తాన్ని పీల్చుకుంటాయి. నిట్స్ అని పిలువబడే గుడ్లు పెడతాయి. తలపై పేలు ఉండి గోకితే ఇన్ఫెక్షన్‌తో పాటు జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. తల పేను సమస్య పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. మరీ అమ్మాయిలను ఎక్కువగా పేలు ఇబ్బంది పెడతాయి.

1 / 8
తలలో  పేలు ఉష్ణోగ్రత అనుకూలంగా ఉన్నప్పుడు వృద్ధి చెందుతాయి. పేలు ఉంటే రాత్రి నిద్ర ఉండదు. కొందరు తలలో పేలు దురద పెడుతుంటే బహిరంగంగా పేల గురించి చర్చించడానికి చాలా మంది సిగ్గుపడతారు. అయితే పేల సమస్య ను సులభంగా తొలగించుకోలేము. దీంతో కొందరు యాంటీ పేల షాంపూ ఉపయోగిస్తారు. దీనివలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. దీంతో రసాయనిక షాంపులను పక్కకు పెట్టి పేల నుంచి విముక్తి కోసం ఇంట్లో దొరకే వస్తువులకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి. పేల నుంచి ఉపశమనం పొందండి.

2 / 8
జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చీలడం-ఇవి చాలా సాధారణ సమస్యలు. జుట్టు గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమస్యలను సులభంగా తొలగించవచ్చు. అయితే తలలో ఉండే పేల వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. పేలను వదిలించుకోవటం సులభం కాదు.

3 / 8
టీ ట్రీ ఆయిల్, లావెండర్, పిప్పరమెంటు, వేప వంటి అనేక ముఖ్యమైన నూనెలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పేను సమస్యను దూరం చేస్తాయి.

4 / 8
కొబ్బరి నూనెతో 15-20 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి తలకు.. జుట్టు కుదల్లకు బాగా అప్లై చేయండి. 30 నిమిషాలు వదిలి షాంపూ చేయండి. ఇలా చేస్తే 7 రోజుల్లో పేల నుంచి విముక్తి లభిస్తుంది.

5 / 8
పేల నుంచి విముక్తి కోసం వేప ఆకులను ఉపయోగించండి. వేప ఆకులను పేస్ట్ చేసి అందులో పుల్లటి పెరుగు కలిపి జుట్టుకు తలకు పట్టించాలి. 30-45 నిమిషాలు వదిలి షాంపూ చేయండి. మీరు వేప ఆకులకు బదులుగా వేప నూనెను కూడా రాసుకోవచ్చు.

6 / 8
వెనిగర్ తో పేలకు చికిత్స చేయవచ్చు. 1/2 కప్పు నీటిలో 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకోండి. దీంతో పేల నుంచి విముక్తి లభిస్తుంది.

7 / 8
పేను వదిలించుకునే విషయానికి వస్తే ఇంటి నివారణలతో పాటు కొన్ని నియమాలను పాటించాలి. ఉదాహరణకు.. పేలను జుట్టు నుంచి బయటకు తీసే దువ్వెనను ఉపయోగించండి

8 / 8
ముఖ్యంగా ఒకరి దువ్వెనను మరొక ఉపయోగించవద్దు. అయితే ఈ చిట్కాలు ఒక్కరోజులో పేలని చంపవు. పేలు పూర్తిగా తల నుంచి తగ్గేవరకూ ఈ సింపుల్ చిట్కాలను తరచుగా ఉపయోగిస్తూనే ఉండాలి. ఈ నివారణ చర్యల వలన జుట్టు భద్రంగా ఉంటుంది. అంతేకాదు పేలను ఎటువంటి రసాయనకి పదార్ధాలు వినియోగించకుండా తగ్గించుకోవచ్చు.