- Telugu News Photo Gallery High Blood Pressure in Winter: Guarding Your Heart Against Seasonal Challenges
High Blood Pressure in Winter: శీతాకాలంలో అధిక రక్తపోటు గుండెకు మరింత ప్రమాదం.. ఈ కాలంలో వీటికి దూరంగా ఉండండి
నేటి కాలంలో అధిక మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటుకు నిత్యం మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు. దీనికి తోడుగా జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా బయటి ఆహారాన్ని తినే ధోరణి, వ్యాయామం పట్ల విముఖత, ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు అధిక రక్తపోటు సమస్యను మరింత పెంచుతాయి. స్ట్రెస్‌తో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. చలికాలంలో అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ..
Updated on: Jan 04, 2024 | 11:48 AM

నేటి కాలంలో అధిక మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటుకు నిత్యం మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు. దీనికి తోడుగా జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా బయటి ఆహారాన్ని తినే ధోరణి, వ్యాయామం పట్ల విముఖత, ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు అధిక రక్తపోటు సమస్యను మరింత పెంచుతాయి. స్ట్రెస్‌తో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ.

చలికాలంలో అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలిని కూడా మార్చుకోవడం చాలా అవసరం. చల్లని వాతావరణంలో వెచ్చగా, సౌకర్యవంతమైన దుస్తులను ధరించడంతోపాటు ఇంకా ఏమి చేయాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే..

చల్లని వాతావరణంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. చలికాలంలో కూడా శారీరకంగా చురుకుగా ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేస్తుండాలి. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి, క్రమం తప్పకుండా నడక, యోగా చేయాలి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బరువు పెరుగుతారనే భయంతో చాలా మంది కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటారు. కానీ కొవ్వు పదార్ధాలను పూర్తిగా మానేయడం ఇది సరికాదు. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి అవసరం. బాదం, వాల్‌నట్స్, ఆలివ్ ఆయిల్, చేపలు మొదలైన వాటిని తినవచ్చు.

ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి అలాగే చిప్స్, వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సోడియం, కేలరీలు అధికంగా ఉండే ఆహారాలు రక్తపోటు సమస్యలను పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే ఆహారాలను కూడా నివారించండి. శీతాకాలంలో రోజుల మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి.





























