- Telugu News Photo Gallery Business photos Indian railways developing super app for all railway needs
Indian railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఇకపై అన్ని రకాల సేవలకు..
దేశంలో ఎక్కువ మంది ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ రోజూ లక్షల్లో ప్రయాణికులు రైల్వేల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకుంటారు. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ సైతం ఎప్పటికప్పుడు కొంగొత్త సేవలను అందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది..
Updated on: Jan 04, 2024 | 10:38 AM

మారుతోన్న టెక్నాలజీకి ఆధారంగా ఇండియన్ రైల్వేస్ తమ సేవలను సైతం విస్తరిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఐఆర్‌సీటీసీతో పాటు పలు రకాల ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రైలు టికెట్ బుకింగ్ కోసం ఒక యాప్, ఏవైనా ఫిర్యాదులు ఉంటే చేయడానికి మరో యాప్, జనరల్ టికెట్ బుకింగ్స్ ఇంకో యాప్.. ఇలా రకరకాల అవసరాల కోసం రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో యూజర్లకు సమస్యగా మారుతోంది.

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇండియన్ రైల్వేస్ ఓ సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. భారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రైల్వే శాఖ రూ. 90 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీనిని అభివృద్ధి చేయనుంది. దీంతో రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా పొందొచ్చు.

రైల్వేకు సంబంధించిన అన్ని సేవలతో పాటు ఐఆర్‌సీటీసీ అందించే విమాన టికెటింగ్ బుకింగ్, ఫుడ్ డెలివరీ వంటి సేవలను కూడా ఈ యాప్ ద్వారా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ యాప్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకున్నారు.





























