Mustard Leaves : చలికాలంలో ఈ ఆకుకూర తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా ! ఈ విషయాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

|

Nov 30, 2024 | 3:06 PM

ఆకుకూరలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అందుకే ప్రతి రోజూ కప్పు ఆకుకూర మీ భోజనంలో తప్పనిసరిగా ఉండాలే చూసుకోవాలంటారు పోషకాహర నిపుణులు. ఇక శీతాకాలం సీజన్‌లో మార్కెట్లో అనేక రకాలైన ఆకు కూరలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఒక ఆవా కూర. ఆవాల ఆకులు మన ఆర్యోగానికి ఎలా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఆవాల ఆకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఆవాల ఆకు కూర వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇందులో విటమిన్‌ సి, మైక్రో న్యూటియన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు..ఆవాల ఆకును యాంటీ క్యాన్సర్‌ ఆకు అని పిలుస్తారు. దీని తీసుకోవడం వల్ల లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు, ఇతర క్యాన్సర్‌ కణాలను వ్యాప్తి చెందకుండా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు.

2 / 5
ఆవాల‌ను మైక్రో గ్రీన్స్ లాగా త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో రోగ నిరోధ‌క శక్తి మెరుగుప‌డుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌లు ఈ ఆవాల ఆకును తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆవాల ఆకును తీసుకోవడం వల్ల అనేక అనార్యోగ సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

3 / 5
ఆవాలు, ఆవాల ఆకులు, ఆవ పిండిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో ఐరన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఆవ కూర తినటం వల్ల జీవక్రియ రేటు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. ఆవ ఆకులలో డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆవాల ఆకులను ఆహారంలో చేర్చి తినడం వల్ల దృష్టిలోపాలు తగ్గుతాయి.

4 / 5
చలికాలంలో ఆవాలు, ఆవకూర, ఆవపిండి తీసుకోవటం వల్ల మీ శరీరంలో మెరుగైన జీవక్రియ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో సహాయపడే ఖనిజాల మంచి మూలం. ఇది మీ జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, ఆహారాలు జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. ఆవాలలో ఉండే పొటాషియం శరీరం నుండి నీరు నిలుపుదలని తగ్గిస్తుంది. అలాగే ఇందులో విటమిన్ K  కూడా పుష్కలంగా ఉంటుంది.

5 / 5
ఆవాల ఆకులు, బంగాళా దుంపలు కలిపి పరోటాలు  చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ ఆకులతో కొందరు పులుసు కూడా చేస్తారు. మరికొందరు ఈ ఆకులతో కూర వండుకొని తింటారు. ఎలా తిన్నాకూడా ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలో ఫైబర్, ఐరన్ , ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ కె గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ బయటకు పోతుంది.