
Potato

అందుకే తప్పకుండా బంగాళదుంపల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కొందరు డబ్బు సంపాదించడానికి మార్కెట్‌లో నకిలీ బంగాళదుంపలు అమ్మడం ప్రారంభించారు, వీటిని గుర్తించడం చాలా కష్టం, నకిలీ బంగాళ దుంపలు తినడం వలన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

నకిలీ బంగాళ దుంపలల్లో ఉండే కృత్రిమ రంగులు, అందులో వాడే రసాయనాలు శరీరానికి చాలా హానికరం అంట. ఇవి మూత్రపిండాలు, కాలేయాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతే కాకుండా నకిలీ బంగాళ దుంపలు అతిగా తినడం వలన కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

కాగా, మార్కెట్‌లోని నకిలీ బంగాళ దుంపలను ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం చూద్దాం. నిజమైన బంగాళ దుంపలను వాసనను బట్టి గుర్తించ వచ్చునంట. తాజా, నిజమైన బంగాళ దుంపలు సహజ వాసనను కలిగి ఉంటాయంట. నకిలీవి రసాయన వాసన కలిగి ఉంటాయి. అలాగే లేత ఎరుపు రంగు బంగాళదుంపలు నకిలీవని చెబుతున్నారు నిపుణులు.

ఇవే కాకుండా మీరు బంగాళ దుంపను కోసినప్పుడు దాని రంగు లోపల, వెలుపల దాదాపు ఒకేలా ఉంటే అది సహజమైనది, నకిలీ బంగాళదుంపలో బయట, వెలుపల రంగు భిన్నంగా ఉంటుందంట. అదే విధంగా, నకిలీ బంగాళదుంపపై ఉన్న బుద నీటిలో కరిగిపోయి, త్వరగా శుభ్రపడుతుందంట. కానీ నిజమైన బంగాళ దుంప పై ఉన్న బురద రుద్దిన తర్వాత కూడా అంత త్వరగా శుభ్రపడదంట. ఈ చిట్కాల ద్వారా సులభంగా నకిలీ, నిజమైన బంగాళ దుంపలను గుర్తించవచ్చునంట.