
గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లటినీరు తాగడం, కూల్ డ్రింక్స్ తాగడం చేయకూడదు. వీలైనంత వరకు గోరు వెచ్చటి నీరు ప్రతి రోజూ తీసుకోవాలి. అలాగే హెర్బల్ టీ, అల్లం టీ, తులసి టీ వంటివి తాగడం వలన ఇవి గొంతు సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.

వెల్లుల్లిలో అల్లసిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన గొంతు సమస్యలతో బాధపడే వారు వెల్లుల్లి రెబ్బలను నమలడం, లేదా వెల్లుల్లి రసం తీసుకోవడం. అలాగే ఆహారంలో ఎక్కువగా వెల్లుల్లిని చేర్చుకోవడం చేయాలి. దీని వలన తర్వగా గొంతు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంట.

గొంతు నొప్పికి అల్లం టీ చాలా అవసరం. గొంతు నొప్పితో బాధపడే వారు తప్పకుండా అల్లం టీ తాగాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. దీని వలన త్వరగా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

గొంతు సమస్యతో బాధపడే వారు ఉప్పు నీటితో పుక్కిలించడం చాలా మంచిదంట. గోరు వెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలిపి రోజూ ఉదయం బ్రష్ చేసే సమయంలో వీటిని రెండు లేదా మూడు సార్లు పుక్కులించి ఉంచాలంట. దీని వలన వీలైనంత వరకు గొంత సమస్య తగ్గుతుంది. అలాగే ఉప్పు నీటిలో ఉండే బ్యాక్టీరియా గొంతు నొప్పి, వాపు తగ్గిస్తుందంట.

గొంతు సమస్యతో బాధపడే వారు నిద్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. ఎక్కువ సేపు నిద్రపోవడం వలన గొంతు నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.( నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)