లివర్ ఆరోగ్యానికి ఆరు చక్కటి ఆహార పదార్థాలు ఇవే!
ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. అయితే కొంత మంది మాత్రం ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేసి అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఈ మధ్య కాలంలో కాలేయ సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ ఫుడ్ తీసుకోవాలంటున్నారు వైద్యులు.
Updated on: Jun 05, 2025 | 8:36 PM

మానవ శరీరంలో కాలేయం ముఖ్యమైన అవయవం. అంతే కాకుండా ఇది శరీరంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొవ్వులను విచ్ఛిన్నం చేసి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది కాలేయ వ్యాధి బారినపడి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ఈ వ్యాధి కూడా త్వరగా లక్షణాలు చూపెట్టకపోవడంతో చాలా మందికి ఇది తీవ్రమైన సమస్యగా మారిపోతుంది. అందుకే కాలేయ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంటారు.

చాలా వరకు ఆల్కహాల్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఊబకాయం, లేదా కొన్ని రకాల మందులను విపరీతంగా వాడటం వలన కాలేయ వ్యాధి వస్తుంది. దీనికి చికిత్సలు ఉన్నప్పటికీ ఇది కొన్ని సార్లు ప్రమాదకరంగా కూడా మారుతుంది. అయితే కాలేయ వ్యాధి రాకుండా ఉండాలన్నా, కాలేయ ఆరోగ్యం కోసం తప్పకుండా కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

జంతువులపై చేసి అధ్యయనాల్లో కాలేయ వాపును తగ్గించడంలో యాపిల్స్, ఉల్లిపాయలు, బెర్రీలు కీలక పాత్ర పోషించాయంట. ఇందులో ఉండే క్వెర్సెటిన్ కాలేయ వాపును తగ్గించడమే కాకుండా, లివర్ ఆరోగ్యానికి దోహదపడతాయంట. అందుకే తప్పకుండా ప్రతి వ్యక్తి తమ డైట్ లో ఈ ఆహార పదార్థాలు చేర్చుకోవాలంట. అలాగే సిట్రస్ పండ్లు, ద్రాక్ష,నారింజ వంటి పండ్లు కూడా కాలేయ ఆరోగ్యానికి వరం. అందుకే వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోవాలంట.

అలాగే గ్రీన్ టీ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. అందుకే కనీసం రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వన కాలేయ పనితీరు బాగుంటుందంట. అలాగే కాఫీ కూడా కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా బ్లాక్ టీ చాలా ఉత్తమమైన ఎంపిక.

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అయితే ఈ పసుపును మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుందంట. అంతే కాకుండా కాలేయ పనితీరుకు దోహదపడుతుంది. అలాగే రెడ్ వైన్ లో రెస్వెరాట్రాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయంట.



