Platelet Count: రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతోందా? కౌంట్ పెంచడానికి ఈ ఆహారాలను తీసుకోండి..

| Edited By: Anil kumar poka

Nov 04, 2022 | 3:59 PM

డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితిలో, ప్లేట్‌లెట్లను పెంచడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. త్వరగా కోలుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆహారంలో ఏ ఆహారాలను చేర్చుకోవచ్చో ఇప్పుడు మనం

1 / 7
డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితిలో, ప్లేట్‌లెట్లను పెంచడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. త్వరగా కోలుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆహారంలో ఏ ఆహారాలను చేర్చుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 7
ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు: గుమ్మడి గింజలు, దానిమ్మ గింజలు, పప్పులు, ఆకు కూరలు తినడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది.

3 / 7
బొప్పాయి ఆకులు: డెంగ్యూ జ్వరాన్ని నయం చేయడానికి బొప్పాయి ఆకులు అత్యంత ప్రభావవంతమైన ఔషధాలలో ఒకటి. బొప్పాయి ఆకు రసం తాగవచ్చు. తాజా బొప్పాయి ఆకులను నీటిలో వేసి మరిగించి డికాషన్‌గా తీసుకోవచ్చు.

4 / 7
కొబ్బరి నీరు: కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు రోజూ 1 నుంచి 2 గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగాలి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

5 / 7
విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు: కోడి గుడ్లు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కాలేయం, మాంసం, బ్రకోలీ, పార్స్లీ వంటి విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది.

6 / 7
మెంతి గింజలు: డెంగ్యూ జ్వరం చికిత్సలో మెంతులు సహాయపడతాయి. తలనొప్పి, కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయట పడటానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇవి జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి గింజలను టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.

7 / 7
హెర్బల్ టీ : హెర్బల్ టీ తీసుకోవడం వల్ల డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవచ్చు. కొబ్బరి నీళ్లు, వేడినీళ్లు తాగడమే కాకుండా హెర్బల్ టీ కూడా తాగవచ్చు. ఇది వికారం, అలసట సమస్య నుండి రక్షిస్తుంది.