
మానసిక , శారీరక ఆరోగ్యానికి యోగా చాలా మంచిది. కానీ చాలామంది యోగా చేసిన తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులేంటో తెలుసుకుందాం.

యోగా సమయంలో చాలా శక్తి ఖర్చు అవుతుంది. అందుకే యోగా చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు.

యోగా తర్వాత మీకు ఆకలిగా అనిపించినా, వెంటనే తినకండి. కావాలనుకుంటే యోగాకు ముందు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు.

యోగాసనాల సమయంలో కండరాలు విస్తరించి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యోగా చేసిన వెంటనే స్నానం చేయకూడదు.

యోగాసనం ముగింపులో శవాసనం చేస్తారు. ఈ ఆసనం ముఖ్యం కాదని మీరు అనుకుంటే మీరు తప్పు. ఇది మీ రోజువారీ యోగాభ్యాసం తర్వాత మీ శరీరానికి, మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది.