
అంతేకాకుండా లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నోటి ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహిస్తాయి. మృదువైన చర్మం అందిస్తాయి.

ఆహారంలో లవంగాలను ఎలా చేర్చుకోవాలంటే.. ఉదయం టీలో 2-3 లవంగాలను జోడించి తాగవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో లవంగాలను వేసి రోజంతా త్రాగవచ్చు. వంగాల పొడిని సూప్‌లు, డెజర్ట్‌లపై చల్లి వినియోగించవచ్చు.

దంత సమస్యలను నివారించే శక్తి కూడా లవంగాలకు ఉంది. లవంగాలలో ఉండే యాంటీ జింజివిటిస్, యాంటీప్లేక్ లక్షణాలు దంతాలను ఆరోగ్యంగా ఉండటానికి సహయపడతాయి.. లవంగాలు నోటిలోని సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడటమే కాకుండా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్, మంట, నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి.

అంతేకాదు..లవంగాలను చక్కెర స్థాయిని నియంత్రించే శక్తి కూడా ఉంది. దీని కోసం లవంగం టీ తయారు చేసుకుని తీసుకోవాలి. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో 8-10 లవంగాలను మరిగించాలి. ఆ తరువాత, నీటిని ఫిల్టర్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత తాగాలి. దీంతో అద్భుత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చర్మ సమస్యలకు కూడా లవంగంతో చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం లవంగాన్ని మెత్తగా నూరి, మొటిమల మీద రాస్తే, మొటిమ పక్కకు విస్తరించకుండా త్వరగా రాలిపోతుంది. అలాగే, వాంతి అవుతుందనిపించినప్పుడు లవంగాన్ని వాసన చూడాలి. అలాగే లవంగం రసాన్ని చప్పరించినా ఫలితం ఉంటుంది.