Health Tips: ఖర్జూరం కలిపిన పాలు తాగితే ఆ సమస్యలన్నీ దూరం.. నిత్యం తీసుకుంటే ఆందం ఆరోగ్యం..
Health Benefits: పాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే పాలను నేరుగా కాకుండా ఖర్జూరాలను కలుపుకుని తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని, ఆనేక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు శరీరానికి కూడా చాలా అవసరమైనవని అంటున్నారు. ఇంతకీ పాలల్లో ఖర్జూర కలుపుకుంటే ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 22, 2023 | 12:39 PM

కీళ్ల నొప్పులు మాయం: పాలల్లో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఎముకలను బలేపేతం చేసే పోషకాలు ఉంటాయి. అలాగే ఖర్జూరలో అనేక రకాల యాంటీ ఆక్సెడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడమే కాక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

జ్ఞాపకశక్తి: మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచడంలో ఖర్జూరాలు కలిపిన పాలు కీలకంగా పనిచేస్తాయి. దీనిలోని పోషకాలు నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, బ్రెయిన్‌కి బూస్టింగ్ ఇస్తాయి.

జీర్ణ సమస్యలు: జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఖర్జూరంలోని ఫైబర్ చక్కని పరిష్కారం. ఖర్జూరాలు కలిపిన పాలను తాగితే జీర్ణక్రియ పెరుగుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్తి, కడుపు మంట వంటి సమస్యలు దూరం అవుతాయి.

రక్తహీనత దూరం: ఖర్జూరం, పాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా ఖర్జూరం కలిపిన పాలను తాగితే రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఐరన్ శరీరంలో రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి, రక్తహీనతను నివారిస్తుంది.

చర్మ సంరక్షణ: చర్మాన్ని మెరిసేలా చేయడంలో పాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇక ఖర్జూరాలు కలిపిన పాలు తాగితే చర్మంపై మంట, చికాకు వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే తాగితే రక్త ప్రసరణ పెరిగి ముఖం ఆకర్షణీయంగా మారుతుంది.





























